BREAKING : సీఎం జగన్‌కు షాక్.. మరో నేత రాజీనామా!

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీలో పార్టీ నేతల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూల్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు.

New Update
BREAKING : సీఎం జగన్‌కు షాక్.. మరో నేత రాజీనామా!

Kurnool YCP MP Resigned : మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వైసీపీ అధినేత, సీఎం జగన్(CM Jagan) కు వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీలో నేతల రాజీనామాల పర్వానికి ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇంకా నేతల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూల్(Kurnool) వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ (Sanjeev Kumar Singari) ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ(YCP) పార్టీతో పాటు తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి లోక్ సభ స్పీకర్ కు తన రాజీనామా పత్రాన్ని అందించనున్నారు.

ఇంకా డిసైడ్ కాలేదు...

వైసీపీ పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎంపీ పదవికి రాజీనామా(Resign) చేసిన కర్నూల్ ఎంపీ డా.సంజీవ్ కుమార్(Dr. Sanjeev Kumar) ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ హయాంలో ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని అన్నారు. సీఎం జగన్ ను కలవడానికి ఫోన్లు చేస్తే ఎవరు రిసీవ్ చేసుకోలేదని ఆరోపించారు. బీసీలకు పెద్దపీఠం వేస్తామని వైసీపీ పార్టీ చెబుతుందే తప్ప దాన్ని అమల్లోకి తీసుకురండని అన్నారు. తాను ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకోలేదని.. త్వరలో తన నిర్ణయం ఏంటో చెబుతానని తెలిపారు.

అభ్యర్థుల మార్పే కారణమా?..

రాబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly Elections) విజయం సాధించేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. వైసీపీ పార్టీ మాత్రం మరోసారి అధికారంలో ఉండేందుకు సర్వేలలో గెలిచే అవకాశం తక్కువగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేసింది. వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి టికెట్ తమకే వస్తుంది అనుకున్న కొందరు నేతలకు ఇది బిగ్ షాక్ లా మారింది. తమకు టికెట్ రాకపోవడంతో కొందరు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదే బాటలో ఉన్నట్లు సమాచారం.

మూడో లిస్ట్ పై ఆశలు..

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల రెండు లిస్టులను వైసీపీ పార్టీ విడుదల చేసింది. తాజాగా మూడో లిస్ట్ పై కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అందరి చూపు మూడో లిస్ట్ పైనే ఉంది. ఈ రోజు లేదా రేపు వైసీపీ మూడో లిస్ట్(YCP 3rd List) వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మూడో లిస్ట్ వచ్చాక ఎంత మంది వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తారనే చర్చ అక్కడి రాజకీయాల్లో నెలకొంది. దీనిపై క్లారిటీ రావాలంటే మూడో లిస్ట్ వచ్చే దాక వేచి చూడాలి.

Also Read : ఆ 5 టికెట్లు ఇవ్వాల్సిందే.. జగన్ కు కేశినేని నాని పెట్టిన డిమాండ్లు ఇవే?

Advertisment
తాజా కథనాలు