Kurchi Thatha: హేమ అరెస్టుపై కుర్చీ తాత పంచ్ డైలాగులు.. ఐదు వేలు పడేస్తే చాలంటూ..

నటి హేమ అరెస్టుపై సోషల్ మీడియా స్టార్ కుర్చీ తాత (కాలా పాషా) షాకింగ్ కామెంట్స్ చేశాడు. రేవ్ పార్టీకి హాజరైన హేమ తన జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుందన్నాడు. విచ్చలవిడిగా తిరగడం, డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయడం ఎందుకు.. అవసరమా. బయట ఐదు వేలు పడేస్తే గంజాయి దొరుకుంతుందన్నాడు.

New Update
Kurchi Thatha: హేమ అరెస్టుపై కుర్చీ తాత పంచ్ డైలాగులు.. ఐదు వేలు పడేస్తే చాలంటూ..

Hema: బెంగళూర్ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని అరెస్టు అయిన నటి హేమపై సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత (కాలా పాషా) పంచ్ డైలాగులు వేశాడు. ‘రేవ్ పార్టీ భారతీయ కల్చర్ కాదు. దానికి హాజరైన హేమ అడ్డంగా దొరికిపోయింది. చివరికి ఏమైంది అరెస్ట్ అయి జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుంది. రేవ్ పార్టీలకు వెళ్లి విచ్చలవిడిగా తిరగడం, డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయడం ఎందుకు.. అవసరమా. అందరూ అనుకున్నట్లు ఎంట్రీ టికెట్ లక్షల్లో ఉండదు. రూ. 500 ఉంటుంది. లక్షల్లో ఎంట్రీ టికెట్ కోసం ఎవ్వడూ ఖర్చుపెట్టడు. రూ. 5 వేలు పడేస్తే గంజాయి కూడా ఇస్తారు. అలాగే రూ. 50 వేలకు ఇంజెక్షన్లు ఇస్తారు. నేను హైదరాబాద్‌లో ఇప్పిస్తాను. అబద్ధాలు చెప్పడానికి హద్దుండాలి. అయితే కొందరు హేమను ట్రోల్స్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు సాయం చేయాలి లేదా ఓ మూల కూర్చోవాలి అంతే కానీ నిజానిజాలు తెలియకుండా మాట్లాడుకూడదు’ అంటూ హేమను తిడుతూనే మద్ధతుగా నిలిచాడు.

Advertisment
తాజా కథనాలు