నిన్న ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో కుత్భుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ (MLA Vivekanand), బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై (Srishailam Goud) దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూన శ్రీశైలం గౌడ్ ఆర్టీవీతో మాట్లాడారు. వివేకానంద్ కు అభద్రతా భావం పెరిగిపోయిందని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కింద ప్రజలు సమస్యలతో నిలదీయడంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయాడని ధ్వజమెత్తారు. గతంలో ఆర్మూర్ ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డితో పాటు అనేక మందిపై దాడి చేసిన చరిత్ర ఎమ్మెల్యేకు ఉందన్నారు. గతంలో సమస్య పరిష్కారానికి వచ్చిన ఐటీ ఉద్యోగిని కూడా ఇంట్లోకి తీసుకెళ్లి ఎమ్మెల్యే దాడి చేశాడన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Politics: ఉరికించి కొడతాం.. బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్..!
అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై దాడి చేశాడన్నారు. తాను బాధ్యత కలిగిన వ్యక్తిగా సంయమనం పాటించినట్లు చెప్పారు. ప్రజాబలం తగ్గిందనే ఫస్ట్రేషన్ తోనే ఎమ్మెల్యే ఇలా ప్రవర్తిస్తున్నాడన్నారు. తాను గతంలో ఇండిపెండెంట్ గా గెలిచానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వివేకానంద్ రూ.10 వేల కోట్లను సంపాధించాడన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే హామీల అమలులో విఫలమయ్యాడని విమర్శించారు.
ఆయన కు పని తక్కువ.. ప్రచారం ఎక్కువ ఉంటుందని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. ఇన్ కం ట్యాక్స్ కట్టే వారికి దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు. కుత్భుల్లాపూర్ ప్రజలు ఈ సారి తనను తప్పనిసరిగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.