కాంగ్రెస్‌లో జూపల్లి కృష్ణారావు చేరి 20 రోజులు కూడా కాలేదు అప్పుడు కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో
వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌లో చేరిన మంత్రి జూపల్లి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి రంగినేని అభిలాష రావు అగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకుపోతాని చెప్పిన ఆయన.. ఇప్పుడు తన క్యాడర్‌కు మాత్రమే ప్రాధ్యానత కల్పిస్తూ తమను అవమానానికి గురిచేస్తున్నారన్నారు. ఎలాంటి సమావేశాలు జరిగినా తమకు ఆహ్వానం పంపడం లేదని అభిలాషం ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కార్యకర్తల మాటలను, ప్రతి అంశాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, రిపోర్ట్ ఇచ్చిన 15 రోజులలో పరిస్థితి చక్కబడకపోతే అవసరానికి వాడుకొని వదిలేసిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. జూపల్లి కృష్ణారావు పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడన్న ఆయన.. అది జూపల్లి కృష్ణారావో, లేక నేనో కోరుకోగానే రాదన్న అభిలాషం.. పార్టీ అధిష్టానం.. పార్టీ కొసం కష్టపడి పని చేసిన వారికి ఇస్తుందన్నారు. టికెట్ దక్కని వారు ప్రతిపక్షంలో వుండి పనిచేయడానికి సిద్దంగా ఉండాలన్నారు. గతంలో జూపల్లి కృష్ణారావు ఆత్మగౌరవం కోసం ఏ విధంగా పోరాటం చేశారని, తాను ఆయనలా తమ కార్యకర్తలతో నా ఆత్మ గౌరవం కోసం, మా మనోభావాలు దెబ్బతినకుండా ఉండటంకోసం రాబోయే రోజులలో ఎలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధిష్టానానికి పిర్యాదు చేస్తామన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ టికెట్ టికెట్ అశించి పార్టీలోకి వెళ్లిన జూపల్లికి కాంగ్రెస్‌లో సైతం టికెట్ దక్కదనే వార్త వినిపిస్తుంది. పార్టీకోసం కష్టపడే వారికి టికెట్ ఇవ్వాలంటే.. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన జూపల్లికి టికెట్ ఇస్తారా ఇవ్వారా అనేది ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. జూపల్లికి అధిష్టానం టికెట్ ఇస్తుందా.. వచ్చే సవంత్సరం జరుగబోయ్యే పార్లమెంట్ ఎన్నికల కోసం అపుతుందా అనేది చూడాలి మరి.