/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T142547.667-jpg.webp)
Kumari Aunty in Star Maa BB Utsavam: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న పేరు కుమారి ఆంటీ (Kumari Aunty). స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్న ఈమె సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రెటీలా మారిపోయింది. మాదాపూర్ లోని (Madhapur) ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా 5 కేజీల రైస్‌తో వ్యాపారం స్టార్ చేసిన కుమారి ఆంటీ .. ఇప్పుడు రోజుకు 100 కేజీల ఫుడ్ సర్వ్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. నాన్న, బుజ్జి అంటూ తన దగ్గరకు వచ్చే కస్టమర్స్ ను పలకరిస్తూ.. రుచికరమైన భోజనం అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అక్కడ భోజనం చేసిన వాళ్ళు.. వీడియోలు తీసి పోస్ట్ చేయడంతో ఈమె ఫుడ్ బిజినెస్ (Food Business) మరింత పాపులరైంది. దీంతో ఈమె ఫుడ్ కోసం జనాలు ఎగబడుతున్నారు.
Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్
స్టార్ మా లో స్పెషల్ గెస్ట్ గా కుమారీ ఆంటీ
ఇలా సోషల్ మీడియాలో ఫుల్ ఫెమసైన కుమారీ ఆంటీ.. ఇప్పుడు స్టార్ మా లో ఒక ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రీ యూనియన్ పేరుతో 'బిగ్ బాస్ ఉత్సవం' (Bigg Boss Utsavam) అనే స్పెషల్ షో ప్లాన్ చేశారు స్టార్ మా. ఈ షోకు కుమారి ఆంటీ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. అక్కడ తన చేసిన నాన్ వెజ్ భోజనాన్ని కంటెస్టెంట్స్ అందరికీ రుచి చూపించారు. కుమారీ ఆంటీ రుచుకరమైన భోజనానికి అందరు ఫిదా అయిపోయారు. అంతే కాదు కంటెస్టెంట్స్ అందరితో కలిసి స్టేజ్ పై డాన్సులు వేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఈ షో త్వరలోనే స్టార్ మా (Star Maa), డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ ఈవెంట్ కు యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించారు.
#BBUtsavam షో లో #KumariAunty 😍
అందరికీ NonVeg భోజనం కూడా కుమారి హోటల్ నుండే ... pic.twitter.com/hI4q4oQ5f7
— VIKRAM (@alwaysmb123) February 7, 2024
ఇటీవలే కుమారీ ఆంటీ ఫుల్ ముందు భారీ ట్రాఫిక్ ఏర్పడడంతో.. ఫుడ్ స్టాల్ క్లోజ్ అవ్వడం.. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తిరిగి ఓపెన్ అవ్వడంతో ఈమె మరింత పాపులర్ అయ్యింది. ఇక ఈ మధ్య కుమారీ ఆంటీ బిగ్ బాస్ షోకి వెళ్తారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఇంతలోనే స్టార్ మా షోలో గెస్ట్ గా పాల్గొని సందడి చేశారు.
Also Read: Kumari Aunty: కుమారి ఆంటీకి పోలీసుల షాక్.. ఫుడ్ బిజినెస్ బంద్
 Follow Us
 Follow Us