KTR: ఫ్రీ బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌ ని అమలు చేయండి: కేటీఆర్‌ !

ప్రభుత్వ స్కూళ్లలో తాము ప్రవేశ పెట్టిన బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌ ను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం తమ అనాలోచిన నిర్ణయాన్ని పునఃపరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలు చేయాలని కేటీఆర్‌ కోరారు.

New Update
KTR : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ!

Breakfast Scheme: ప్రభుత్వ స్కూళ్లలో తాము ప్రవేశ పెట్టిన బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌ ను కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Government) రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. తమిళనాడు ప్రభుత్వం బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌ ను విస్తరించిన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌ పిల్లలతో బ్రేక్‌ఫాస్ట్‌ తింటున్న వీడియోను కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌ లో పోస్టు చేసి కామెంట్‌ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పిల్లలకు ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్‌ లాంటి అద్భుతమైన స్కీమ్‌ ను రద్దు చేయడం నిజంగా దురదృష్టకరం. కేసీఆర్‌ ప్రభుత్వం స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించింది.

ఈ స్కీమ్‌ ని విస్తరించాలని కూడా ప్రభుత్వం భావించింది. ప్రస్తుత ప్రభుత్వం తమ అనాలోచిన నిర్ణయాన్ని పునఃపరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలు చేయాలని కేటీఆర్‌ కోరారు.

Also read: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు…హోం మినిస్టర్‌ తో భేటీ!

Advertisment
తాజా కథనాలు