BRE Working President KTR: తన వయసు మరొక ఏడాది పెరిగిందని..మరి కొంచెం పెద్దవాడనయ్యానని అన్నారు కేటీఆర్. తాను బతికి ఉన్నంతవరకు తను లైఫ ఇచ్చిన సిరిసిల్లకు సే చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. నేత కార్మికుల కుటుంబాలు, వారి పిల్లల విద్యా, భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. దాంతోపాటూ హైదరాబాద్‌లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సమక్షంలో ఆయన తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ హోంలో ఉన్న 100 మంది విద్యార్థినిలకు లాప్‌టాప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల గురించి తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్.
నేను 2009 నుండి 5 పర్యాయాలు సిరసిల్లకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు కేటీర్. సిరిసిల్ల పెద్ద నేత కమ్యూనిటీకి పేరుగాంచిన ప్రాంతం...ఇక్కడ 30,352 నేత యూనిట్లు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడి వారు ఇంకా బాదలు పడుతూనే ఉన్నారు.వారి అవసరాలకు తగిన సదుపాయాలు సకూరడం లేదు. బీర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్ల, ఇతర ప్రాంతాలలోని నేత కార్మికులకు నెలవారీ ఆదాయాన్ని అందించాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం దానిని నిలిపేసింది. దీంతో పవర్ లూమ్ , చేనేత పరిశ్రమ కష్టాలు పడుతోంది. గత కొన్ని నెలల్లో 14 మంది నేతన్నఆత్మహత్యలు (సిరిసిల్లలో 9, ఖమ్మంలో 2, కరీంనగర్‌లో 1, నల్గొండలో 1, గద్వాలలో 1) చేసుకున్నారు. ఇలాంటి దుర్ఘటనల వల్ల నష్టపోయిన చేనేత కుటుంబాలు ఎదుర్కొంటున్న తీవ్ర కష్టాలను తాను కళ్లారా చూశానని కేటీర్ చెప్పారు. అందుకే వారికి మద్దతు అందిండానికి ముందుకు వచ్చానని తెలిపారు.నేను మొత్తం 14 కుటుంబాలను ఆదుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలాగే బీఆర్ఎస్ పార్టీ సహోద్యోగులు కూడా ముందుకు రావాలని కోరుతున్నానని కేటీఆర్ పిలుపునిచ్చారు.