Telangana Elections 2023:ఎన్నికల ప్రచారంలో జోరు..మెట్రో ట్రైన్ లో కేటీఆర్ సందడి

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ హైదరాబాద్ అంతా చుట్టేస్తున్నారు. మొన్న చార్మినార్, పాతబస్తీ దగ్గర హడావుడి చేసిన కేటీఆర్ ఈరోజు మెట్రో ట్రైన్ లో సందడి చేశారు. రాయదుర్గం నుంచి బేగంపేట్ వరకు ప్రయాణించారు.

New Update
Telangana Elections 2023:ఎన్నికల ప్రచారంలో జోరు..మెట్రో ట్రైన్ లో కేటీఆర్ సందడి

కేటీఆర్ ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది.. పాతబస్తీలో తిరిగినా...మెట్రో ట్రైన్ లో ప్రయాణించినా. ఎన్నికల ప్రచారంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు కేటీఆర్. అందరిలాగ మాటలతో సరిపెట్టకుండా జనాల మధ్యలోకి వెళుతూ...తాను మామూలు మనిషిలాగే ఉంటానంటూ ప్రచారం చేస్తున్నారు. మొన్నటికి మొన్న చార్మినార్ దగ్గర షాదాబ్ కి వెళ్ళి బిర్యానీ తిన్నారు. మొజాంజాహీ మార్కెట్ లో నేచురల్ ఐస్ క్రీమ్ తిన్నారు. అక్కడ ఉన్నవారందరితో చాలా మంచిగా, సరదాగా మాట్లాడి అట్రాక్ట్ చేశారు.

ఇక ఈరోజు ఉదయాన్నే మెట్రో ట్రైన్ ఎక్కేసి సందడి చేసేసారు. సాధారణ ప్రయాణికుడిలా నిలబడి వెళ్ళారు. సడెన్ గా కేటీఆర్ ని అలా చూసేసరికి ట్రైన్ లో ఉన్నవారందరూ ఆశ్యర్యపోయారు. మంత్రి కేటీఆర్ రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బేగంపేట్ వరకు ప్రయాణించారు. ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో క్రెడాయ్ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ జరిగింది. ఆ సదస్సుకు కేటీఆర్ మెట్రోలనే వెళ్ళి హాజరయ్యారు. ఈ సందర్భంలో మెట్రోలో ప్రయాణిస్తున్నవారు కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.

మొత్తం 20 నిమిషాలు కేటీఆర్ ట్రైన్ లో ప్రయాణించారు. ఈ టైమ్ మొత్తం అంతా ప్రయాణికులతో ముచ్చటించారు. ఇందులో విద్యార్ధులు కూడా ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు