PrajaPalana: రోడ్డుపై దరఖాస్తులు..బీ కేర్ ఫుల్‌.. కేటీఆర్ వార్నింగ్‌

ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపై కనిపించడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎవరైనా కాల్‌ చేసి పెన్షన్‌, ఇళ్లు ఇస్తామంటే OTP షేర్ చేయొద్దని ప్రజలను హెచ్చరించారు. ఓటీపీ షేర్ చేస్తే సైబర్ నేరగాళ్లు ఖాతాలో నుంచి డబ్బును కాజేస్తారని అన్నారు.

New Update
PrajaPalana: రోడ్డుపై దరఖాస్తులు..బీ కేర్ ఫుల్‌.. కేటీఆర్ వార్నింగ్‌

KTR Serious On PrajaPalana Applications: రోడ్లపై ప్రజాపాలన దరఖాస్తులు కనిపించడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) స్పందించారు. దరఖాస్తుల్లో కొట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా (Personal Information) ఉందని అన్నారు. సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) చేతికి డేటా చేరకుండా చూడాలని ప్రభుత్వానికి (Congress Government) కేటీఆర్ సూచించారు.

ఎవరైనా కాల్‌ చేసి పెన్షన్‌ (Pension), ఇళ్లు (Indiramma Illu)ఇస్తామంటే OTP షేర్ చేయొద్దని తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. OTP షేర్ చేస్తే ఏం కాదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. భట్టి విక్రమార్క మాటలను నమ్మి అనవసరంగా డబ్బు పోగొట్టుకోకండి అని అన్నారు. సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకోకండి...బీ కేర్‌ ఫుల్‌ అంటూ ట్విట్టర్ (X) లో రాసుకొచ్చారు.

ALSO READ: తెలంగాణ, ఏపీలో ఒకేసారి ఎన్నికలు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు

ప్రజాపాలన దరఖాస్తులు (Praja Palana Applications) రోడ్డుపై కనిపించడంపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఇందుకు కారణమైన వారిపై చర్యలకు ఉపక్రమించింది. హయత్‌నగర్‌ వాల్యూయేషన్‌ అధికారి మహేందర్ పై సస్పెన్షన్‌ వేటు వేసింది సర్కార్. కుత్భుల్లాపూర్ నోడల్ ఆఫీసర్ పై కూడా ప్రభుత్వం వేటు వేసినట్లు తెలుస్తోంది. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ బాధ్యలను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది.

దీంతో వారు తమ ఇళ్లకు దరఖాస్తులను తీసుకెళ్లి డేటా నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తుల్లో ఆధార్ (Aadhaar), రేషన్ కార్డు(Ration Card), ఫోన్ నంబర్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో బ్యాంక్ ఖాతా నంబర్ల వివరాలను సైతం అధికారులు సేకరించారు. దీంతో ఈ డేటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. సైబర్ నేరగాళ్ల చేతికి ఈ డేటా వెళ్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు