రేవంత్ రెడ్డిని ఓడిస్తే నరేందర్ రెడ్డికి ప్రమోషన్.. కొడంగల్‌లో కేటీఆర్ సంచలన ప్రకటన!

కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తే పట్నం నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇప్పిస్తా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కొడంగల్‌ పేరును చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంటు పోయిందని సెటైర్లు చేశారు.

New Update
రేవంత్ రెడ్డిని ఓడిస్తే నరేందర్ రెడ్డికి ప్రమోషన్.. కొడంగల్‌లో కేటీఆర్ సంచలన ప్రకటన!

KTR Comments On Revanth Reddy: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మంత్రి కేటీఆర్(KTR). వరుస సభలతో బీఆర్ఎస్ పార్టీ(BRS) చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈరోజు సిరిసిల్లలో నామినేషన్ వేశారు కేటీఆర్. అనంతరం అర్ముర్‌లో జీవన్ రెడ్డి(Jeevan Reddy) ప్రచారరథంలో పాల్గొన్నారు. అదే సమయంలో ప్రచారరథాన్ని ఒక్కసారిగా డ్రైవర్ ఆపివేయగా మంత్రి కేటీఆర్ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై స్పందించిన కేటీఆర్.. తనకు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. అనంతరం ఆర్మూర్‌ నుంచి కొడంగల్ రోడ్‌షోలో పాల్గొనేందుకు కేటీఆర్ వెళ్లారు.

ALSO READ: BJP Final List: ఆ 11 మంది ఎవరు?.. కొనసాగుతున్న ఉత్కంఠ!

కొడంగల్‌లో రేవంత్ కేటీఆర్ కామెంట్స్:

ప్రచారంలో భాగంగా ఈరోజు కొడంగల్ రోడ్‌షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) టార్గెట్‌గా కేటీఆర్ విమర్శలు చేశారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకెళ్తోందని కేటీఆర్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంటు పోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు 24 గంటల విద్యుత్‌ కాదని 5 గంటలు ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. కొడంగల్‌ పేరును చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు కేటీఆర్. రెండేళ్లలో కొడంగల్‌లోని 1.25 లక్షల ఎకరాలకు కృష్ణా నీళ్లిస్తాం అని హామీ ఇచ్చారు.

రేవంత్‌రెడ్డి నమ్ముకుంది పైసలను.. లీడర్లను కొంటున్నారని ఆరోపించారు కేటీఆర్. కొడంగల్‌ ప్రజలను మాత్రం రేవంత్‌రెడ్డి ఎన్నటికీ కొనలేరని అన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల కోసం కొత్త కార్యక్రమాలు తెస్తామని.. సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి ఆడబిడ్డ ఖాతాలో రూ.3 వేలు వేస్తామని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌పై పెంచిన రూ.800 భరించి రూ.400కే ఇస్తామని పేర్కొన్నారు. తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా అందిస్తామని తెలిపారు.

అలాగే, నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో కొండంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడగొట్టి బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని(Narender Reddy) గెలిపించాలని కోరారు. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే సీఎం కేసీఆర్ కాళ్ళు పట్టుకోనైనా సరే ఆయనకు ప్రొమోషన్ ఇప్పిస్తానని తెలిపారు. దీంతో నరేందర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రి పదవి వచ్చేలా కనిపిస్తుంది.

ALSO READ: కేసీఆర్‌కు సొంత కారు కూడా లేదు.. ఆస్తుల వివరాలు చూస్తే షాకే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు