KTR Responds : ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఈ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. రేవంత్(Revanth Reddy) కు మీడియా సమావేశం పెట్టి ఆధారాలు చూపెట్టే దమ్ము లేదని విమర్శించారు. రేవంత్ తన వ్యక్తిత్వన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నేను హిరోయిన్ల(Heroines) ను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడిందని.. అలాంటివి చేయాల్సిన కర్మ నాకెందుకని అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎవ్వరిని వదలమని అన్నారు.
Also Read: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం : వరల్డ్ బ్యాంక్
2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అప్పటి కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్‌లు కూడా తమ ఫొన్లను కిరణ్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారని కేటీఆర్ అన్నారు. 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఇప్పుడున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపించకుండా.. ఎన్ని రోజులు రోజులు టైం పాస్ చేస్తారంటూ విమర్శించారు. గొర్ల స్కామ్, బర్ల స్కామ్, కాళేశ్వర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ అంటూ.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. మంచినీళ్లు ఇవ్వకుండా, సాగునీరు అందించకుండా, రైతుల పంటలు ఎండిపోతే పట్టించుకోకుండా ఉంటున్నారంటూ విమర్శించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని సవాల్ చేశారు.
Also Read: క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం.. 14 రోజుల్లోనే..!
Also Read : పెట్రోల్, డీజిల్ ధరలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..