Telangana: ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి..జాహ్నవి కేసు మీద స్పందించిన కేటీఆర్

అమెరికాలో యాక్సిండెట్‌కు గురైన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసు మీద బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ స్పందిచారు. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

New Update
Telangana: ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి..జాహ్నవి కేసు మీద స్పందించిన కేటీఆర్

KTR Responded on Jaahnavi Death Case: అమెరికాలో జాహ్నవిని పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో ఢీకొట్టిన అమెరికన్ పోలీస్ పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు (America Court) విడుదల చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). ఈ విషయంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ (Jaishankar) కూడా వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అసలే ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం కూడా జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అన్నారు కేటీఆర్.

గత ఏడాది అమెరికాలోని సియాటెల్‌లో జాహ్నవి అనే తెలుగు అమ్మాయిని పోలీస్‌ పెట్రోలింగ్ వాహనం గుద్దేసింది. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. ఆ తరువాత జాహ్నవి మృతి మీద మరొక పోలీస్ అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు అన్నట్లుగా అతను మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీని మీద స్పందించిన భారత్.. ఆ అధికారి మీద వెంటనే చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో అతనిని విధుల నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 

ఇదేమన్యాయం..

మరోవైపు ఈ ప్రకటన మీద జాహ్నవి బంధువులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి వేగంగా పోలీస్ పెట్రోలింగ్ కారు నడపడం వల్లనే యాక్సిడెంట్ అయిందని..ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కారు నడుపుతున్న కెవిన్ డేవ్ 100 మైళ్ళకు పైగా వేగంతో కారును నడిపారని చెబుతున్నారు. ఈ విషయం ప్రాథమిక విచారణలో కూడా తేలిందని…కానీ ఇప్పుడు సాక్ష్యాధారాలు లేవని చెప్పడం ఏంటని అడుగుతున్నారు.

Also Read:Virat Kohli Son :వైరల్ అవుతున్న విరాట్ కొడుకు అకాయ్ ఏఐ ఫోటోలు

Advertisment
తాజా కథనాలు