KTR: నేతన్నలవి ప్రభుత్వ హత్యలే- సీఎం రేవంత్‌కు కేటీఆర్ బ‌హిరంగ లేఖ

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేత‌న్న‌ల‌వి ఆత్మ‌హ‌త్య‌లు కాదు.. అవి ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్య‌లే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నేత‌న్న‌ల‌కు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అని నిల‌దీశారు. దీనికి సంబంధించి ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

New Update
MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు

BRS Working President KTR: ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ పది ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే అని కేటీఆర్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా? అని ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ మండిప‌డ్డారు. తెలంగాణలో పదేళ్ల తరువాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయ‌ని, మ‌ళ్లీ సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం త‌లెత్తింద‌న్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆపేసింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దు. గతంలో నేతన్నలకు తమ పార్టీ, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు.

మరోవైపు కేంద్రం అస‌మ‌ర్థ‌త విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు పొంత‌న లేకుండా పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. నీట్ పేప‌ర్ లీకైనా.. కేంద్రం జులై 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తుంది. ఎలాంటి కార‌ణాలు చూప‌కుండా నీట్ పీజీ ప‌రీక్ష వాయిదా వేశారు. వీట‌న్నింటికీ కార‌ణం నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ అల‌య‌న్స్‌(ఎన్డీఏ) అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.జూన్ 4వ తేదీన నీట్ యూజీ పేప‌ర్ లీక్ అయింది. జూన్ 19న యూజీసీ నెట్ ఎగ్జామ్‌ను క్యాన్షిల్ చేశారు. జూన్ 21న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్‌ను వాయిదా వేశారు. జూన్ 22న చివ‌రి నిమిషంలో నీట్ పీజీటీ ఎగ్జామ్‌ను వాయిదా వేశార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read:Telugu MP’s: పంచెకట్టుతో పార్లమెంటుకు ఎంపీలు, తెలుగులో ప్రమాణం

Advertisment
Advertisment
తాజా కథనాలు