/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-12.jpg)
Jitta Balakrishna Reddy: అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జిట్టా బాలకృష్ణా రెడ్డిని కేటీఆర్ శనివారం పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు కేటీఆర్. అదే విధంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులతోనూ కేటీఆర్ మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. జిట్టా త్వరలోనే కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులకు చెప్పిన కేటీఆర్ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.