TS : ఆంధ్రోళ్ల బూట్లు నాకి సీఎం అయ్యావు.. ఎవరు మగాడో తేల్చుకుందాం దా.. కేటీఆర్ సవాల్!

సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్‌ సీఎం అయ్యారన్నారు. కారు కూతలు, చిల్లర మాటలు ఇకనైనా మానుకోవాలని సూచించారు. మల్కాజ్‌గిరిలో పోటీ చేసి ఎవరు మగాడో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు.

TS : ఆంధ్రోళ్ల బూట్లు నాకి సీఎం అయ్యావు.. ఎవరు మగాడో తేల్చుకుందాం దా.. కేటీఆర్ సవాల్!
New Update

KTR : తెలంగాణ(Telangana) సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పై బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ చిల్లరగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అలా మాట్లాడటం మానుకోవాలన్నారు. అంతటితో ఆగకుండా తన సవాల్‌ను స్వీకరించి మల్కాజ్‌గిరిలో గెలిచి ఎవరి దమ్మేంటో చూసుకుందాం దా.. అంటూ సవాల్ విసిరారు.

ఓడిపోతే మగాడు కాదా?
ఈ మేరకు కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడిపోతే మగాడు కాదా?. నా సవాల్‌ను రేవంత్‌ రెడ్డి ఎందుకు స్వీకరించట్లేదు. మల్కాజ్‌గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం. ఎవరు మగాడో తేల్చుకుందాం' అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు.. 'మా అయ్య పేరు కేసీఆర్‌. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చిన. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. అంతేగానీ రేవంత్‌రెడ్డిలాగా రాంగ్‌ రూట్‌లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి.. పార్టీలు మారి రేవంత్‌ సీఎం అయ్యారు. కారు కూతలు, చిల్లర మాటలు రేవంత్‌ ఇకనైనా మానుకోవాలి. ముఖ్యమంత్రి హుందాగా మాట్లాడాలి' అంటూ తనదైన స్టైల్ లో మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Seethakka : కవితకు సీతక్క కౌంటర్.. జీవో నెంబర్‌ 3పై సెటైర్లు!

కాంగ్రెస్‌ భరతం పడతారు..
ఇక మేడిగడ్డ(Medigadda) ఇష్యూపై స్పందిస్తూ.. 85 పిల్లర్లు ఉంటే.. అందులో 3 కుంగిన మాట వాస్తవమే అన్నారు. 'కాళేశ్వరం, మేడిగ్డ కొట్టుకుపోలేదు. 3 నెలల సమయంలో ఈ ప్రభుత్వానికి పిల్లర్లు బాగు చేసే టైమ్ దొరకట్లేదా?. ఈ నెల 17వ తేదీ వరకు ఓపిక పడతాం. కాంగ్రెస్‌ పాలన వంద రోజులు అయ్యాక ప్రజల్లోకి వెళ్తాం. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. రుణమాఫీ చేయకపోతే రైతులు కాంగ్రెస్‌ భరతం పడతారు' అంటూ హెచ్చరించారు.

#ktr #cm-revanth #sensational-allegations
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe