KTR : కిన్నెర వాయిద్యకారుడు, పద్మ శ్రీ అవార్డు(Padma Sri Award) గ్రహిత దర్శనం మొగులయ్యకు.. మజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం మొగులయ్య కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడని ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వారల్ అయ్యింది. గత ప్రభుత్వం అందించిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో ఆయన కూలీ పని చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేటీఆర్.. మొగులయ్యను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
ఈ క్రమంలోనే ఆదివారం కేటీఆర్.. మొగులయ్య(Kinnera Mogilaya) ను వ్యక్తిగతంగా కలిసి కొంత ఆర్థిక సాయాన్ని అందించారు. గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్‌తో పాటు అన్ని హామీలను నెరవర్చాలని రాష్ట్ర సర్కార్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మొగులయ్య వంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణమని.. వాళ్లని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. తనకు ఆర్థిక సాయం చేసిన కేటీఆర్‌కు మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు.
అయితే గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 వేల గౌరవ వేతనం ఈ మధ్యే నిలిపివేశారని వాపోయారు. ఇంట్లో పూటగవడం కోసం చాలా చోట్ల ప్రయత్నించినట్లు చెప్పారు. తనపై సానుభూతి చూపించి మర్యాదపూర్వకంగా పని ఇవ్వలేదని అన్నారు. 'గత ప్రభుత్వం నాకు కోటీ రూపాయలు గ్రాంట్‌గా ఇచ్చింది. ఆ డబ్బను నేను నా పిల్లల వివాహాల కోసం ఉపయోగించాను. తుర్కయంజాల్‌లో కొంత భూమి కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. కానీ డబ్బులు సరిపోక మధ్యలోనే ఆపేశాను. రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి 3 సార్లు వెళ్లాను. ప్రతిసారీ కొత్త కలెక్టర్ వస్తున్నారు. త్వరలో హయత్‌నగర్ దగ్గర స్థలం కేటాయిస్తామని అంటున్నారు తప్పు ఏమీ చేయడం లేదని' మొగిలయ్య అన్నారు.
ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను కూడా మొగిలయ్య కలిశారు. తన సమస్యలను వారికి చెప్పగా.. వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం కోసమే తాను వేచి చూస్తున్నానని మొగిలయ్య చెప్పారు. ఇదిలాఉండగా.. దర్శనం మొగిలయ్య స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. ఆయన పూర్వీకులు మెట్ల కిన్నెర వాయిస్తూ కథలు చెబుతుండేవారు. వాళ్ల నుంచి ఆ కళను వారసత్వంగా స్వీకరించాడు మొగిలయ్య. తెలంగాణ జీవన విధానాన్ని, చారిత్రక గాథల్ని, తన పాటల రూపంలో కిన్నెర వాయిద్యంతో ప్రచారం చేస్తున్నాడు. కిన్నెర వాయిద్యాన్నే తన ఇంటి పేరుగా మార్చుకొని.. కిన్నెర మొగిలయ్యగా స్థిరపడ్డారు. 2021లో పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌లో మొగిలయ్య తన వాయిద్యంతో కనిపించాడు. ఆ తర్వాత ఈయనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
Also Read: రానున్న 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..