కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్‎లో చెల్లుతుందా!: కేటీఆర్ సెటైర్

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకే ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో రోడ్డు షో కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. బీఆర్ఎస్ బీజేపీతో ఎప్పుడూ జత కట్టలేదని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో దూరంగానే ఉంటామని అన్నారు.

New Update
కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్‎లో చెల్లుతుందా!: కేటీఆర్ సెటైర్

Telangana Elections 2023: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకే ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో రోడ్డు షో కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. బీఆర్ఎస్ బీజేపీతో ఎప్పుడూ జత కట్టలేదని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో దూరంగానే ఉంటామని అన్నారు. నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పొరపాటునైనా గెలిస్తే అటువైపు తొంగిచూడరని విమర్శించారు. గతంలో 11సార్లు అవకాశమిచ్చినా ఏమీ చేయని కాంగ్రెస్ ఇంకో చాన్స్ అడుగడంలో అర్థం లేదన్నారు.

ఇది కూడా చదవండి: చెప్పే దమ్ముందా?.. రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సవాల్

కాంగ్రెస్, బీజేపీల రాజకీయాలకు లొంగేది లేదన్న కేటీఆర్ పదేళ్ల అభివృద్ధిని చూసి ఓటర్లు తమ పార్టీని మరోసారి ఆదరించాలని కోరారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు దీటుగా నిజామాబాద్‌ ట్యాంక్‌బండ్‌ ఉందని, నగరంలో అపరిష్కృతంగా ఉన్న ఎన్నో పనులను అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్త హయాంలో పూర్తి చేశారని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు మతపరంగా ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్ లో చెల్లుతుందా? అంటూ షబ్బీర్ అలీపై సెటైర్లు వేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు