TG: త్వరలోనే కేటీఆర్ అరెస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు! కేటీఆర్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ బాంబు పేల్చారు. బీఆర్ఎస్ అవుట్‌డేటెడ్ పార్టీ, వాళ్లతో ఎలాంటి చర్చలు లేవని చెప్పారు. ఎప్పటికైనా కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. By srinivas 10 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అవుట్‌డేటెడ్ పార్టీ, వాళ్లతో ఎలాంటి చర్చలు లేవు. ఎప్పటికైనా కేటీఆర్ జైలుకు పోక తప్పదన్నారు. ఇక పదేళ్లు తెలంగాణను కేసీఆర్ నిజాం నవాబులా పాలించారని, తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ (BJP) ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డ్ భూములు బీఆర్ఎస్, ఎంఐఎం కబ్జా.. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీకి పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ సెటైర్స్ వేశారు. ఇక వక్ఫ్ బోర్డ్ భూములను గతంలో బీఆర్ఎస్, ఎంఐఎం కబ్జా చేసిందని ఆరోపించారు. మిగిలిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ కబ్జా చేయాలని చూస్తోందన్నారు. తమ్ముడు కోసమే రేవంత్ రెడ్డి యూఎస్ వెళ్లాడని ఆరోపించడం తప్పు. కేటీఆర్ సూటు బూటుతో వెళ్లి ఎన్ని ఉద్యోగాలు తెచ్చాడు? అని అడిగారు. ఇక కవిత బెయిల్ విషయంపై మాట్లాడుతూ.. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి తాము ఎవరిమని అన్నారు. సిసోడియాకు మేము బెయిల్ ఇచ్చామా? అందంతా చట్టం చూసుకుంటుందని చెప్పారు బండి సంజయ్. Also Read: దీనికి బాధ్యులు ఎవరో చెప్పండి.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్! #brs #ktr #bjp #bandiya-sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి