KTR: నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ మాట తప్పింది.. కేటీఆర్‌ ఆగ్రహం!

నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా భట్టి మాట తప్పారని విమర్శించారు కేటీఆర్‌. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా పైనా కాంగ్రెస్‌ మాట మార్చిందన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలన్నారు.

KTR: నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ మాట తప్పింది.. కేటీఆర్‌ ఆగ్రహం!
New Update

KTR Comments on Batti: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్ సాధించిన ఓట్లు కేవలం నాలుగు లక్షలేనన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. బీఆర్‌ఎస్‌ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామని చెప్పుకోచ్చారు కేటీఆర్‌. పోయిన సారి మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామని.. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజ్ గిరి లో ఈ సారి విజయం బీఆర్‌ఎస్‌దేనన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్‌ ఇంకేం అన్నారంటే?
➼ 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ గత నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి పిలుపునిచ్చారు.
➼ వారి మాటలనే నేను గుర్తు చేశాను.
➼ నేను బిల్లులు కట్టొద్దంటే భట్టి నాది విధ్వంసకర మనస్తత్వం అని అంటున్నారు.
➼ నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా?
➼ సోనియానే బిల్లులు కడుతుందని వాళ్ళు చెప్పారు .. కరెంటు బిల్లులు సోనియాకే పంపుదాం.
➼ సోనియాకు ప్రజలు బిల్లులు పంపేలా బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలి.
➼ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు .. మనం ఇప్పట్నుంచే ఒత్తిడి చేయాలి.

నిరుద్యోగ భృతిపై కామెంట్స్:
నిరుద్యోగ భృతిపై భట్టి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పారని విమర్శించారు కేటీఆర్‌. నిరుద్యోగ భృతి పై కాంగ్రెస్ తప్పించుకున్నట్టే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా పై మాట మార్చిందన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్ధంగా వాడుకోవాలని సూచించారు. మనం పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని తిప్పికొట్ట లేకపోయామన్నా కేటీఆర్. ప్రగతి భవన్ లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారని.. ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారన్నారు. విలాసాలే అందులో ఉంటే భట్టి ఈ పాటికే టాం టాం చేయక పోయేవారా అని ప్రశ్నించారు. ఆన్లైన్‌లో రేషన్ కార్డులు ఇచ్చామని.. ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు. పార్టీ కమిటీలు కూడా పూర్తిగా వేయకపోవడం వల్ల నష్టం జరిగిందని.. ఇక ముందు అలా జరగదని తెలిపారు.

భయపడం:
గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవన్నారు కేటీఆర్‌. కారు కేవలం సర్వీసింగ్ కు వెళ్ళిందని.. మళ్ళీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారని.. కార్యకర్తలు అధైర్య పడొద్దని సూచించారు. పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందని తెలిపారు. మోదీకీ, రేవంత్ రెడ్డికీ భయపడే పార్టీ బీఆర్‌ఎస్ కాదన్నారు.పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యల మీద పోరాడిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని గుర్తు చేశారు.

Also Read: అఫ్ఘానిస్థాన్‌లో కూలిన భారత్‌ విమానం!

WATCH:

#brs #ktr #congress #batti-vikramarka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe