నీటి విడుదల ఆపండి.. నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ

నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ (KRMB) లేఖ రాసింది. కుడి కాలువకు నీటి విడుదల వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. సాగునీరు కావాలని ఏపీ తమను కోరలేదని లేఖలో పేర్కొంది. ఉద్రిక్తతలకు తెరదించాలని కేఆర్‌ఎంబీ కోరింది.

సాగర్ వివాదానికి కారణం కృష్ణా బోర్డు వైఫల్యమే.. ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి లేఖ
New Update

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ (KRMB) లేఖ రాసింది. కుడి కాలువకు నీటి విడుదల వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. సాగునీరు కావాలని ఏపీ తమను కోరలేదని లేఖలో పేర్కొంది. ఉద్రిక్తతలకు తెరదించాలని కేఆర్‌ఎంబీ కోరింది. ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేయడం సరికాదని సూచించింది. సాగర్‌ను ఆక్రమించారని తెలంగాణ అరోపించిందని కేఆర్ఎంబీ తెలిపింది.

2024 జనవరి, ఏప్రిల్ లో నీటిని విడుదల చేయాల్సి ఉందని, ఏపీకి మూడు విడతల్లో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నామని కేఆర్‌ఎంబీ వెల్లడించింది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ పోలీసులపై కేసు నమోదు అయ్యింది. ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్ విజయపురి టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. A-1గా ఏపీ పోలీస్‌ ఫోర్స్‌ను పేర్కొంటూ.. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, మాచర్ల రూరల్ సీఐ, ఇరిగేషన్ అధికారుల తోపాటు మరికొంతమందిపై నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఇది కూాడా చదవండి: IND vs AUS: సిరీస్ మనదే.. ఒక మ్యాచ్ మిగిలుండగానే భారత్ ఘనవిజయం

రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదానికి చెక్ పెట్టేందుకు కేంద్ర హోం శాఖ శుక్రవారం నాడు రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు ప్రతిపాదన పంపింది. దీంతో నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్ధితిని కొనసాగించాలని ఇరు ప్రభుత్వం నిర్ణయించాయి. అలాగే డ్యామ్ నిర్వహణను కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించాయి. దీనితో పాటు పాటు డ్యామ్ వద్ద భద్రత బాధ్యతను సీఆర్‌పీఎఫ్ దళాలకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనకు ఓకే చెప్పాయి.

#ap-news #nagarjuna-sagar #krmb
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe