Complaint On Radhakishan Rao : ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) నిందితుడు రాధాకిషన్‌రావు(Radhakishan Rao) మీద మరిన్ని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈయన వెనకు చాలానే నేర చరిత్ర ఉందని తెలుస్తోంది. తాజాగా క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్‌లో ఒకరైన వేణుమాధవ్..రాధాకిషన్‌రావు మీద కంప్లైంట్ చేశారు. తనను కిడ్నాప్ చేసి కోట్లు విలువైన షేర్లు బదిలీ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఒక్క రాధాకిషన్‌రావు మీదనే కాక మొత్తం టీమ్ మీద ఫిర్యాదు చేశారు. దీంతో రాధాకిషన్‌తోపాటు ఇన్‌స్పెక్టర్లు గట్టుమల్లు, మల్లికార్జున్ సహా 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
2018 నవంబరు 22న ఉదయం ఖాజాగూడ దగ్గర ద్విచక్రవాహనాలపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనను అడ్డగించి తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని దాడి చేశారని వేణుమాధవ్ ఫిర్యాదులో వివరించారు. అక్కడ్నుంచి బలవంతంగా టాస్క్‌ఫోర్స్(Task Force) కార్యాలయానికి తీసుకెళ్లారని చెప్పారు. అప్పటికే చంద్రశేఖర్, తాత్కాలిక డైరెక్టర్లతోపాటు పూర్ణచందర్‌రావు అనే మరో వ్యక్తి అక్కడికి చేరుకున్నారు. ఆ తరువాత రాధాకిష్‌రావుతో పాటూ మిగిలిన వారందరూ వంద కోట్ల విలువైన కంపెనీ వాటాను చట్టవిరుద్ధంగా బదిలీ చేయాలని బెదిరించారని వేణుమాధవ్ ఫిర్యాదులో రాశారు.
సీఐ గట్టుమల్లు ఆదేశాలతో ఎస్సై మల్లిఖార్జున్ నకిలీ కరెన్సీ(Duplicate Currency) కేసులో తీసుకొచ్చిన నిందితుల్ని చితకబాది... మీరు మాకు షేర్లు బదిలీ చేయకపోతే మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని బెరిరించారని చెబుతున్నారు వేణు మాధవ్. డీసీపీ రాధాకిషన్‌రావు వచ్చాక చంద్రశేఖర్ వేగె జోక్యం చేసుకుని డీసీపీ చెప్పినట్లు విని డీల్‌కు అంగీకరించాలని చెదిరించారని... ఇంకా ప్రానాలతో బతికున్నందుకు సంతోషించాలని చెప్పారని అన్నారు. ఇన్నాళ్ళు భయపడి దీని గురించి ఫిర్యాదు చేయలేదని...ఇప్పడు ఫెఓన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్‌రావును అరెస్ట్ చేసిన తర్వాత ధైర్యం వచ్చి కంలపైంట్ చేయడానికి ముందుకు వచ్చామని వేణు మాధవ్ చెబుతున్నారు.
Also Read : Haryana: హర్యానాలో బోల్తాపడిన బస్సు..ఆరుగురు చిన్నారులు మృతి