Deep Fake : టెక్నాలజీ తప్పేమీ లేదు.. అంతా మన దగ్గరే ఉంది: కృతి కామెంట్స్ వైరల్

డీప్ ఫేక్ ఇష్యూపై నటి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'డీప్‌ఫేక్‌ల విషయంలో టెక్నాలజీని నిందించడం సరైనది కాదు. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఏఐని సృష్టించింది కూడా మనుషులే అనే విషయం మరిచిపోవద్దు'అని చెప్పింది.

New Update
Deep Fake : టెక్నాలజీ తప్పేమీ లేదు.. అంతా మన దగ్గరే ఉంది: కృతి కామెంట్స్ వైరల్

Kriti Sanon : ఇటీవల ప్రపంచాన్ని కలవరపెడుతున్న డీప్ ఫేక్(Deep Fake) ఇష్యూపై నటి కృతి సనన్(Kriti Sanon) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ చూస్తే ఆనందంగా ఉందని చెప్పింది. కానీ ఇదే మన వినాశనానికి దారితీయడం బాధకరమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు షాహిద్ కపూర్‌(Shahid Kapoor) సరసన ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా’ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నటి.. డీప్‌ఫేక్ గురించి తన అభిప్రాయం వెల్లడించింది.

సరైనది కాదు..
కృతి సనన్ మాట్లాడుతూ.. కొన్ని నెలల నుంచి ప్రముఖులకు చెందిన మార్ఫింగ్‌ వీడియోలు సంచలనం సృష్టిస్తుండటం ఆందోళన కలిగించిందని చెప్పింది. 'కృత్రిమ మేధ సాయంతో చేసిన యాంకర్‌ను చూశాం. అయితే డీప్‌ఫేక్‌ల విషయంలో టెక్నాలజీని నిందించడం సరైనది కాదు. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఏఐ(AI) ని సృష్టించింది కూడా మనుషులే అనే విషయం మరిచిపోవద్దు. టెక్నాలజీ అభివృద్ధి చూస్తుంటే.. భవిష్యత్తులో ఏఐ మన భాగస్వామి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు’ అని చెప్పింది.

ఆశ్చర్యపోయాను..
అలాగే ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తొలిసారి ఈ కథ విన్నప్పుడు ఇది కూడా ఒక అందమైన ప్రేమకథా చిత్రంగా అనిపించిందని చెప్పింది. 'సినిమా ఎలా ఉంటుందో.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా? అనే ఆలోచనే ఉండేది. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుందనే అనుకున్నా. కానీ ఎప్పుడయితే నా పాత్ర ఒక రోబో అని తెలిసిందో ఆశ్చర్యపోయాను. సిఫ్రా అనే రోబో పాత్రలో నేను చేసిన అల్లరి మాములుగా ఉండదు’ అని తెలిపింది.

ఇది కూడా చదవండి : Kiran Rao: ‘యానిమల్‌’ స్త్రీ ద్వేషి అంటూ హీరో భార్య విమర్శలు.. అదే లక్ష్యమంటూ డైరెక్టర్ కౌంటర్

ఎంత బాధగా ఉంటుందో..
అలాగే బోల్డ్ బ్యూటీ(Bold Beauty) భూమి పెడ్నేకర్‌(Bhumi Pednekar) సైతం ఫేక్‌ వీడియోలపై మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, మన ఫొటోలు అలా చూసుకున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించుకోలేనని వాపోయింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి వెంటనే అమలయ్యేలా చూడాలని కోరింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు