Krishna Mukunda Murari: మురారిని లాకప్ డెత్ చేయించాలకున్న తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని ముకుంద తండ్రి శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ముకుంద అక్కడికి వస్తుంది. కూతురు రాగానే మురారిని విడిపించి తప్పు చేశావు ముకుంద అని అంటాడు శ్రీనివాస్. దీంతో ముకుంద తండ్రి పై సీరియస్ అవుతుంది. మురారిని దారుణంగా కొట్టిస్తావా..? అని నిలదీస్తుంది.
మరో వైపు గాయాలతో ఉన్న మురారి నిద్రపోతుంటే తనను అలాగే చూస్తూ రాత్రంతా కూర్చుంటుంది కృష్ణ. ఆ తర్వాత మురారి నిద్రలేచి.. రాత్రంతా నిద్రపోలేదా అని అడుగుతాడు కృష్ణను. దీంతో కృష్ణ కళ్ళు మూస్తే మీరు ఎక్కడ దూరమవుతారో అనే భయంతో మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అని చెప్తుంది. తన పై కృష్ణ ప్రేమను చూసిన మురారి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
మరో వైపు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటాడు ఆదర్శ్. బ్యాగ్ పట్టుకొని కిందకు వస్తాడు ఇది చూసిన నందిని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. ఒకప్పుడు ముకుంద మనసులో స్థానం లేదని వెళ్ళిపోయా.. ఇప్పుడు ఇంట్లోనే చోటు లేదని తెలిసింది అందుకే వెళ్ళిపోతున్నాని అంటాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన మధు కూడా ఆదర్శ్ ను ఆపాలని ప్రయత్నిస్తాడు. పెద్ద పెద్దమ్మ వచ్చే వరకు ఎక్కడికీ వెళ్లే ప్రసక్తి లేదు అని ఆదర్శ్ ను హెచ్చరిస్తాడు. మధు తనను ఆపడంతో అతన్ని ఘోరంగా అవమానిస్తాడు ఆదర్శ్. మందు కోసం బెగ్గర్ లా అడుక్కునేవాడివి.. నువ్వు ఎవడివి నన్ను ఆపడానికి అని అవమానిస్తాడు.
ఆదర్శ్ మధును నానా మాటలు అనడం గమనించిన భవానీ దేవి కొడుకు చెంప చెల్లుమనిపిస్తుంది. వాడికి సంపాదన లేకపోవచ్చు కానీ నీలా సంస్కారం లేని వాడైతే కాదు అని బుద్ది చెప్తుంది. దీంతో ఆదర్శ్ ఇంట్లో ఎవరికీ నా పై ప్రేమ లేదు అని కోపంగా వెళ్ళిపోతాడు.
గాయాలతో ఉన్న మురారిని చూసి భవానీ దేవి ఎమోషనల్ అవుతుంది. తాను ఏ తప్పు చేయలేదని భవానీ దేవికి తన బాధను చెప్పుకుంటాడు మురారి. నా బిడ్డ ఎలాంటి వాడో నాకు తెలుసు దీని వెనుక ఉన్నదెవరో తెలుసుకుంటానని మురారికి అండగా ఉంటుంది భవానీ దేవి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.