Krishna Mukunda Murari: మధును ఘోరంగా అవమానించిన ఆదర్శ్.. కొడుకు చెంప చెల్లుమనిపించిన భవానీదేవి..!

మురారి పై కోపంగా ఉన్న ఆదర్శ్ ఇంటి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. దీంతో మధు తనను ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆదర్శ్ అతన్ని ఘోరంగా అవమానిస్తాడు. ఇది చూసిన భవానీ దేవి కొడుకు చెంప చెల్లుమనిపిస్తుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari: మధును ఘోరంగా అవమానించిన ఆదర్శ్.. కొడుకు చెంప చెల్లుమనిపించిన భవానీదేవి..!

Krishna Mukunda Murari: మురారిని లాకప్ డెత్ చేయించాలకున్న తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని ముకుంద తండ్రి శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ముకుంద అక్కడికి వస్తుంది. కూతురు రాగానే మురారిని విడిపించి తప్పు చేశావు ముకుంద అని అంటాడు శ్రీనివాస్. దీంతో ముకుంద తండ్రి పై సీరియస్ అవుతుంది. మురారిని దారుణంగా కొట్టిస్తావా..? అని నిలదీస్తుంది.

publive-image
మరో వైపు గాయాలతో ఉన్న మురారి నిద్రపోతుంటే తనను అలాగే చూస్తూ రాత్రంతా కూర్చుంటుంది కృష్ణ. ఆ తర్వాత మురారి నిద్రలేచి.. రాత్రంతా నిద్రపోలేదా అని అడుగుతాడు కృష్ణను. దీంతో కృష్ణ కళ్ళు మూస్తే మీరు ఎక్కడ దూరమవుతారో అనే భయంతో మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అని చెప్తుంది. తన పై కృష్ణ ప్రేమను చూసిన మురారి కన్నీళ్లు పెట్టుకుంటాడు.

Krishna Mukunda Murari

మరో వైపు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటాడు ఆదర్శ్. బ్యాగ్ పట్టుకొని కిందకు వస్తాడు ఇది చూసిన నందిని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. ఒకప్పుడు ముకుంద మనసులో స్థానం లేదని వెళ్ళిపోయా.. ఇప్పుడు ఇంట్లోనే చోటు లేదని తెలిసింది అందుకే వెళ్ళిపోతున్నాని అంటాడు.

Krishna Mukunda Murari
ఇంతలో అక్కడికి వచ్చిన మధు కూడా ఆదర్శ్ ను ఆపాలని ప్రయత్నిస్తాడు. పెద్ద పెద్దమ్మ వచ్చే వరకు ఎక్కడికీ వెళ్లే ప్రసక్తి లేదు అని ఆదర్శ్ ను హెచ్చరిస్తాడు. మధు తనను ఆపడంతో అతన్ని ఘోరంగా అవమానిస్తాడు ఆదర్శ్. మందు కోసం బెగ్గర్ లా అడుక్కునేవాడివి.. నువ్వు ఎవడివి నన్ను ఆపడానికి అని అవమానిస్తాడు.

Krishna Mukunda Murari

ఆదర్శ్ మధును నానా మాటలు అనడం గమనించిన భవానీ దేవి కొడుకు చెంప చెల్లుమనిపిస్తుంది. వాడికి సంపాదన లేకపోవచ్చు కానీ నీలా సంస్కారం లేని వాడైతే కాదు అని బుద్ది చెప్తుంది. దీంతో ఆదర్శ్ ఇంట్లో ఎవరికీ నా పై ప్రేమ లేదు అని కోపంగా వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari
గాయాలతో ఉన్న మురారిని చూసి భవానీ దేవి ఎమోషనల్ అవుతుంది. తాను ఏ తప్పు చేయలేదని భవానీ దేవికి తన బాధను చెప్పుకుంటాడు మురారి. నా బిడ్డ ఎలాంటి వాడో నాకు తెలుసు దీని వెనుక ఉన్నదెవరో తెలుసుకుంటానని మురారికి అండగా ఉంటుంది భవానీ దేవి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari

Also Read: Barrelakka pre wedding Video: బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్.. శిరీష భర్త ఎలా ఉన్నాడో మీరే చూడండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు