Krishna Mukunda Murari: భర్త ఆదర్శ్ తో శోభనం జరిగితే చచ్చిపోతానని చెప్పిన ముకుంద మాటలు గురించి ఆలోచిస్తూ సతమతమవుతుంటాడు మురారి. ఎలాగైనా ముకుంద మనసు మార్చి.. ఆదర్శ్, తనను ఒకటి చేయాలనీ అనుకుంటాడు.
మురారికి నిజం చెప్పేసిన ముకుంద.. ఎలాగైనా సరే శోభనం ఆగిపోతుంది అనే ధైర్యంతో సంతోషంగా ఉంటుంది. కలలో మురారితో డ్యూయెట్ వేసుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ముకుందను ఇలా గమనించిన కృష్ణ.. ఒకసారి ఆదర్శ్ అంటే ఇష్టం లేనట్లు ఉంటుంది.. మరో సారి సంతోషంగా ఉంటుందని అనుకుంటూ అయోమయంలో పడుతుంది.
మురారి ఊహల్లో తేలిపోతున్న ముకుంద కృష్ణ ఎంత పిలిచిన పలకదు. చివరికి గట్టిగ పిలిచేసరికి ఉల్లిక్కిపడుతుంది. ఏంటీ ముకుంద రేపు శోభనం అని సంతోషంగా ఉన్నావా అని అంటుంది కృష్ణ. నీకు అలా అర్థమైందా.. నా ఆనందం అంతా శోభనం క్యాన్సిల్ అవుతుందని అంటూ మనసులో అనుకుంటుంది ముకుంద.
కృష్ణ మురారికి ఇష్టమైన ఆనియన్ దోష వేస్తుంది అని తెలుసుకున్న ముకుంద.. ఈరోజు తాను టిఫిన్ చేస్తానని అంటుంది. ఇవాళ నా మురారికి ఇష్టమైన ఆనియన్ దోష నేనే వేస్తాను అని మనసులో అనుకుంటుంది. టిఫిన్ చేయడం వెనుక ముకుంద చెడు బుద్దిని తెలుసుకున్న మురారి.. కోపంగా కిచెన్ లోకి వెళ్తాడు. మురారి హడావిడిగా వెళ్లడం గమనించిన కృష్ణ వెనకాలే వెళ్తుంది.
కిచెన్ లోకి వెళ్లిన మురారి ముకుంద పై కోప్పడతాడు. నువ్వు ఇంక మారవా ..? నీ స్వార్థం కోసం కుటుంబాన్ని మొత్తం మోసం చేస్తున్నావు అంటూ ముకుంద పై తిడతాడు. అయిన సరే మురారి మాటలు లెక్కచేయని ముకుంద.. కృష్ణను నీ జీవితంలో నుంచి పంపించి మనిద్దరం ఒకటవుదాము అని అంటుంది. దీంతో ఒళ్లు మండిపోయిన మురారి.. ముకుంద చెంప పగలగొట్టడానికి చేయెత్తుతాడు.
ఇందంతా చాటుగా విన్న కృష్ణ.. ముకుంద నిజస్వరూపం తెలుసుకొని షాక్ అవుతుంది. ముకుంద ఇన్ని రోజులు నాటకం ఆడిందా అని భాదతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్