Krishna mukunda murari: శోభనం క్యన్సిల్ చేసుకోవడంతో కృష్ణకు.. ముకుంద పై కృష్ణకు అనుమానం మొదలవుతుంది. ముకుంద మనసులో ఏముందో తెలుసుకోవడానికి కావాలనే ఆదర్శ్ తో క్లోజ్ గా ఉండమని ముకుందను ఒత్తిడి చేస్తుంది. కృష్ణకు అనుమానం వస్తుందేమో అని భావించిన ముకుంద భర్తతో భర్త పై ఇష్టం ఉన్నట్లు నటిస్తుంది
ముకుంద ప్రవర్తనను గమనిస్తున్న కృష్ణ.. ముకుంద నిజంగానే మారిందా.. లేదా మారినట్లు నటిస్తుందా అని డౌట్ పడుతుంది. మరో వైపు భర్తతో చనువుగా ఉండడం ఇష్టంలేని ముకుంద.. ఇంకా ఎన్ని రోజులు ఇలా నటించాలి అని మనసులో అనుకుంటుంది. మళ్ళీ శోభనం ఏర్పాటు చేసేలోపు.. ఆదర్శ్ కు నిజం చెప్పేయాలని అనుకుంటుంది.
ఇంట్లో రేవతి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మధు.. ఏంటి పెద్దమ్మ ముకుంద గురించి ఆలోచిస్తున్నావా..? అని అడుగుతాడు. దానికి రేవతి.. ఒకవేళ ముకుంద మారినట్లు నటిస్తుంటే.. కృష్ణ, మురారి, ఆదర్శ్ జీవితాలు ఏమైపోతాయి అని భయపడుతుంది. దీంతో మధు.. ముకుందకు ఆదర్శ్ తో బతకడం తప్పా మరో ఆప్షన్ లేదు.. అలా కాకుండా ఇంకా మురారినే కావాలని కోరుకుంటే.. అది ముకుంద తప్పే అవుతుంది అని రేవతికి దైర్యం చెబుతాడు.
ఇంతలో మురారి, కృష్ణ, ఆదర్శ్, ముకుంద ఇంటికి వస్తారు. ముందుగా కృష్ణ, మురారి మాత్రమే కనిపించడంతో రేవతి.. ఆదర్శ్, ముకుంద ఎక్కడ అని అడుగుతుంది. భర్త పై ప్రేమ ఎక్కువై ముకుంద కాలికి దెబ్బ తగిలించుకుంది.. అని వెటకారంగా అంటుంది కృష్ణ.
ముకుందకు దెబ్బ తగిలిందని చెప్పడంతో.. కంగారు పడుతుంది రేవతి. జాగ్రత్తగా ఉండాలి కదా.. అని ముకుందను హెచ్చరిస్తుంది. ముకుందను లోపలి తీసుకెళ్లమని ఆదర్శ్ తో చెబుతుంది.
మరో వైపు కృష్ణ ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక వేళా ముకుంద ఇంకా మురారినే ప్రేమిస్తే.. ఆదర్శ్ తో అంత క్లోజ్ గా ఉండదు కదా అని అనుకుంటుంది. రాత్రి తగలని దెబ్బకు అంతలా నాటకం ఆడింది. మా శోభనం చెడగొట్టడానికి.. తన శోభనం క్యాన్సిల్ చేసుకున్నట్లుగా అనిపిస్తుంది అని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎలాగైనా ఆదర్శ్, ముకుందలను కలపాలని శోభనం ఏర్పాట్లకు సిద్ధం చేస్తుంది కృష్ణ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.