Krishna Mukunda Murari: ముకుందా మురారి పెళ్లి ఏర్పాట్లు..కృష్ణ ఏం చేయనుంది?

ఆర్టిస్ట్ శ్రీధర్ ను హత్య చేసింది దేవ్ అని మురారి, కృష్ణ నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. మరోవైపు, అత్త భవాని ముకుందా మూరారికి పెళ్లి ఏర్పాట్లు చేస్తోంది. మరి పెళ్లి జరగకుండా కృష్ణ ఏం చేయనుంది? ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎపిసోడ్ జరుగుతోంది.

New Update
Krishna Mukunda Murari: ముకుందా మురారి పెళ్లి ఏర్పాట్లు..కృష్ణ ఏం చేయనుంది?

Krishna Mukunda Murari: ఆర్టిస్ట్ శ్రీధర్ ను హత్య చేసింది దేవ్ అని మురారి, కృష్ణ నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. శ్రీధర్ ఫేస్ పై నిందితుడు దేవ్ యెక్క ఉంగరం అచ్చు పడటంతో ఆ రింగ్ ఎవరిదై ఉంటుందా? అని సతమతమవుతుంటారు. అందరూ కలిసి బోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు దేవ్ కూడా తినాడానికి వస్తాడు. ఆ సమయంలో అత్త భవాని.. ముకుందా మురారి పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతుంది.

Also Read: కావ్యకు బిగ్ షాక్.. గర్ల్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన రాజ్.. ఆమె ఏం చేయనుంది.?

ముకుందా మూరారి పెళ్లి ఏర్పాట్లు..

ముకుందా మురారికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిన అత్త భవాని ఎళ్లుండే వారికి నలుగు పెట్టే కార్యక్రమం అంటూ అందరికి షాక్ ఇస్తుంది. ఎందుకంటే ఇంట్లో ముకుందా అత్త భవానికి తప్ప ఎవరికి ఆ పెళ్లి జరగడం ఇష్టం లేదు. మురారి కృష్ణ తో ఉంటే బాగుంటుందని.. అతడు ఇప్పుడు కృష్ణ నే భార్యగా కావాలని కోరుకుంటున్నాడని అందరికి తెలుసు. కానీ, అత్త భవాని మాత్రం ముకుందా మాయలో పడి.. కృష్ణ బాబాయి మురారిని చంపేందుకు ట్రై చేశాడని ముకుందా చెప్పిన మాటలను నమ్ముతుంది.

Krishna Mukunda Murari

దేవ్ రింగ్ చూసి షాక్ అయిన కృష్ణ..

అయితే, ముకుందా మురారి పెళ్లి గురించి అత్త భవాని మాట్లాడే అప్పుడు.. దేవ్ మంచిగా మాట్లాడుతూ కృష్ణ పై జాలి చూపిస్తున్నట్లు నటిస్తాడు. మురారికి ముకుందతో పెళ్లి జరిగితే కృష్ణ జీవితం ఏమవుతుందో తలుచుకుంటునే బాధ కలుగుతుందని ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు. అప్పుడే కృష్ణ.. దేవ్ వేలికి ఉన్న ఉంగరాన్ని చూసి షాక్ అవుతుంది. ఆర్టిస్ట్ శ్రీధర్ ఫేస్ పై ఉన్న గుర్తును తలుచుకుంటుంది.

Krishna Mukunda Murari

పెళ్లి ఆపేందుకు ఇదే కరెక్ట్..

హత్య చేసింది దేవేనా అని అనుమానం కలుగుతుంది. అయితే, కృష్ణ తెలివిగా దేవ్ ఫొటోను డాక్టర్ కు చూపించి క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుందని సిరియల్ అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే నిందితుడి దేవ్ అని ఒక్క డాక్టర్ కు తప్ప ఇంకా ఎవరికి తెలియదు. సో కృష్ణ దేవ్ ఫొటోను డాక్టర్ కి చూపిస్తే నిందితుడు దేవ్ అని తెలుస్తుంది..ఆ తరువాత ముకుందా తో మురారి పెళ్లి అగిపోతోంది. ఇలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది.

Also Read: Guppedantha Manasu : వసు కిడ్నాప్.. శైలేంద్ర ఫుల్ హ్యాపీ… శైలేంద్ర ప్లాన్ కు ధరణి చెక్ పెట్టునుందా?

Advertisment
తాజా కథనాలు