Krishna Mukunda Murari Serial: ముకుంద నిజంగానే మారిపోయి ఆదర్శ్ తో శోభనానికి రెడీ అయ్యిందని సంతోషపడుతుంది రేవతి. ఇప్పుడు భవానీ అక్క ఉంటే చాలా సంతోషపడేది. తన మనవడు ఎప్పుడు వస్తాడా..? కోసం కలలు కంటూ ఉండేది అని ముకుందతో అంటుంది రేవతి. ఆదర్శ్ అంటే ఏ మాత్రం ఇష్టం లేని ముకుంద.. నేను ఎప్పటికైనా బిడ్డను కనేది నీ కొడుకు మురారితోనే అత్తయ్య అని మనసులో అనుకుంటుంది.
ముకుంద పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదర్శ్ ముకుంద నిజస్వరూపం తెలిస్తే ఏమవుతాడో అని టెన్షన్ పడుతూ ఉంటాడు మురారి. అసలు ఏం చేయాలో అర్ధం కానీ మురారి చిరాకుతో.. తనను తాను తిట్టుకుంటాడు. అద్దంలో చూసుకుంటూ ఏంట్రా నీ బ్రతుకు ఇలా అయిపొయింది అని అనుకుంటాడు.
మరో వైపు ముకుందతో శోభనం గురించి ఊహల్లో తేలిపోతుంటాడు ఆదర్శ్. ఇంతలో అక్కడికి వచ్చిన మధు.. ఏంటీ చాలా హ్యాపీ గా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు మధు.. నాకు శోభనం అని పొరపాటున మా ఫ్రెండ్స్ కు చెప్పాను. అంతే ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి పార్టీ అడుగుతున్నారు అని సంతోషంగా చెప్తాడు.
ఇటు కృష్ణను కూడా శోభనానికి రెడీ చేస్తూ ఉంటుంది చిన్న అత్తయ్య. కానీ కృష్ణ ఆలోచనలు మాత్రం ముకుంద గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అనవసరంగా ఈ శోభనం ఏర్పాట్లు చేశాను.. దీని వల్ల ముకుంద ఆదర్శ్ కు నిజం చెప్పే పరిస్థితి వచ్చింది. అదే ఈ శోభనం లేకపోతే ముకుంద సైలెంట్ గా ఉండేది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
టెన్షన్ తట్టుకోలేకపోతున్న కృష్ణ హడావిడిగా మురారి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ముకుంద వెళ్లి ఏం చేస్తుందో అని భయంగా ఉంది ఏసీపీ సార్ అని మురారికి చెప్తుంది. దీంతో మురారి ఇంకా చేయడానికి మన చేతిలో ఏం లేదు.. పరిస్థితులను ఎదుర్కోవడం తప్పా అని నిరాశగా మాట్లాడతాడు.
మరో వైపు ఆదర్శ్ గదిలోకి వెళ్తుంది ముకుంద. భార్య పై ఎంతో ప్రేమను పెంచుకున్న ఆదర్శ్.. ముకుందను చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముకుంద మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Balakrishna: గాలికి విగ్ ఊడింది.. కోపంతో ఊగిపోయిన బాలయ్య ఏం చేశాడంటే?