Krishna Mukunda Murari: గుడిలో ముకుంద కోరిక కోరుకోవడానికి మురారి దగ్గర కాయిన్ తీసుకుంటుంది. ఇక కృష్ణ కూడా తన కోరిక నెరవేరాలని మురారినే కాయిన్ అడుగుతుంది. ముకుంద మురారి మనసు మారి తనకు సొంతం కావాలని కోరుకొని కాయిన్ నిలబెడుతుంది. ముకుంద కోరిక తప్పు అని ప్రూవ్ చేయడానికి కాయిన్ నిలబెడుతుంది కృష్ణ.
కానీ కృష్ణ కాయిన్ నిలబడదు. ముకుంద కాయిన్ నిలబడుతుంది. దీంతో కృష్ణ షాక్ అవుతుంది. అంటే దీని అర్థం ముకుంద మీకే సొంతం అని కదా ఏసీపీ సార్ అని మురారితో చెప్తూ టెన్షన్ పడుతుంది. ముకుంద తన ఆనందం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. తాను ఎన్ని ప్రయత్నాలు చేసిన తన కోరికలేవి ఫలించవు. నేను ఎప్పటికీ నీకే సొంతం అంటూ కృష్ణకు దైర్యం చెప్తాడు మురారి.
కాయిన్ నిలబడిందని మురిసిపోతున్న ముకుంద.. నువ్వు ఎప్పటికైనా నాకే సొంతం.. శోభనం క్యాన్సిల్ చేసే ప్రయత్నంలో ఉండు అంటూ మురారికి చెప్తుంది. దీంతో మురారి అంత ఎగిసిపడకు.. నిలబెట్టిన నిమిషంలోనే నీ కాయిన్ కిందపడిపోయింది అని ముకుందకు షాకిస్తాడు. నువ్వు కోరుకున్న కోరిక ఈ జన్మలో నెరవేరదు అని ముకుందకు వార్నింగ్ ఇస్తాడు మురారి.
ఆ తర్వాత గుడి నుంచి అందరూ ఇంటికి వస్తారు. కృష్ణ మనసు ఏం బాగోలేదు అని చెప్పడంతో కాఫీ తాగడానికి.. రెస్టరెంట్ తీసుకెళ్తాడు మురారి.
కాఫీ తాగడానికి వెళ్లిన కృష్ణ మురారి అక్కడ వెయిటర్ బాధగా ఉండడం గమనించి ఏమైందని అడుగుతారు. దీంతో వెయిటర్ .. శోభనం రోజు నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను అంటే ఇష్టం లేదని చెప్పింది అని చెప్తాడు. ఇది వినగానే ఆదర్శ్, ముకుందల కథను కనెక్ట్ చేసుకున్న మురారి, కృష్ణ.. ముకుంద కూడా శోభనం రోజు.. ఆదర్శ్ తో ఇలానే చెప్పేసి వెళ్తే.. ఆదర్శ్ ఏమైపోతాడు అని భయపడతారు. ఒకవేళ బాధను తట్టుకోలేక ఆదర్శ్ సూసైడ్ చేసుకుంటే అని టెన్షన్ పడతాడు మురారి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రామ్ – భీమ్.. ఇద్దర్నీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?