Krishna Mukunda Murari: మురారి కోసం ముకుంద కుట్ర.. ఆస్తి రాసివ్వాలని ఆదర్శ్ డిమాండ్.. షాక్ లో భవానీ దేవి..!

మీరాగా రూపం మార్చుకున్న ముకుంద ప్లాన్ ప్రకారం భవానీ దేవి ఇంట్లో సెటిల్ అవుతుంది. ఈ విషయాన్నీ తండ్రి శ్రీనివాస్ కు చెప్తుంది. మరో వైపు మురారి తన షర్ట్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇది చూసిన ముకుంద ఆ షర్ట్ నీకు ఎప్పటికీ కనిపించదు అని అనుకుంటుంది. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari: మురారి కోసం ముకుంద కుట్ర.. ఆస్తి రాసివ్వాలని ఆదర్శ్ డిమాండ్.. షాక్ లో భవానీ దేవి..!

Krishna Mukunda Murari: ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో తన ఫొటోకు దండ వేయడం తట్టుకోలేకపోయిన ముకుంద. ఎలాగైనా ఆ దండను తీయించాలని ప్లాన్ చేస్తుంది. ప్రేమ అనేది మనసులో ఉండాలి.. ఇలా గోడల పై ఎందుకు.. ఆ దండను తీసేస్తే బాగుంటుంది అని చెప్తుంది. ముకుంద పై ప్రేమతో ఆదర్శ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తాడు. దీంతో ఆ ఫొటోకు ఉన్న దండను తీసేయడానికి అందరూ ఒప్పుకుంటారు.

publive-image

భోజనం తర్వాత గదిలోకి వచ్చిన కృష్ణ.. చనిపోయిన వాళ్ళు ఫొటోకు దండ వేయడం తప్పేమీ లేదు కదా.. మరి మీరా ఎందుకు అలా చేసింది అని మురారితో అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో మురారి నీకు ఇంకా ముకుంద పై అనుమానం పోలేదు. ఆ ఫోటోను చూస్తే తన ఫ్రెండ్ చనిపోయిన విషయం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందని అలా చేసిందేమో అని కృష్ణకు సర్ది చెప్తాడు.

publive-image

మరో వైపు మురారి షర్ట్ దొంగలించిన ముకుంద.. ఆ షర్ట్ లో మురారిని ఊహించుకుంటూ ఉంటుంది. ఎప్పటికైనా మురారి తన సొంతం అవుతాడని కలలు కంటూ ఉంటుంది.

publive-image
ఆ తర్వాత బట్టలు మడతపెడుతున్న కృష్ణకు.. మురారి షర్ట్ మిస్ అయ్యిందని తెలుస్తుంది. దీంతో ఆ షర్ట్ ఎక్కడ అని టెన్షన్ పడుతుంది. ఇంతలో మురారి.. ఎక్కడో గాలికి పడిపోయి ఉంటది.. నేను వెళ్లి వెతుకుతాను అని చెప్తాడు.

publive-image
మురారి షర్ట్ కోసం వెతుకుతుండగా అక్కడికి వచ్చిన ముకుంద.. ఏం వెతుకుతున్నావు అని ఆడుతుంది. దీంతో మురారి తన షర్ట్ కనిపించడం లేదని చెప్తాడు. ఇది విన్న ముకుంద.. ఆ షర్ట్ నీకు ఎప్పటికీ దొరకదు.. నువ్వు నాకు సొంతమైన రోజు అది నీ చేతికి వస్తుంది అని మనసులో అనుకుంటుంది.

publive-image
ఆ తర్వాత తన తండ్రి శ్రీనివాస్ దగ్గరకు వచ్చిన ముకుంద.. తాను భవానీ దేవి ఇంట్లో అడుగుపెట్టిన విషయాన్నీ చెప్తుంది. అలాగే అందరూ తాను చనిపోయిందని నమ్మడానికి ఇంట్లో ఉన్న ఫొటోకు దండ వేయమని తండ్రితో చెప్తుంది.

publive-image

మురారి కోసం జ్యూస్ తీసుకొచ్చిన కృష్ణ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో మురారి.. ఏంటీ మళ్ళీ పోలీస్ కేసు గురించి ఆలోచిస్తున్నావా..? అని అడుగుతాడు. దానికి కృష్ణ.. నా భయం అది కాదు.. శ్రీనివాస్ అంకుల్ మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెడతాడేమో అని భయమేస్తుంది అని చెప్తుంది. అలాంటిది ఏమీ జరగదు అని కృష్ణకు దైర్యం చెప్తాడు మురారి.

publive-image
ముకుంద చావును నిజమేనని నమ్ముతున్న ఆదర్శ్.. కృష మురారిల పై కోపంతో పట్ట పగలే ఇంట్లో మందు తాగడం మొదలు పెడతాడు. ఇది చూసిన మధు భవానీ పెద్దమ్మ చూస్తే బాగోదు అని ఆదర్శ్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మధు మాటలను ఆదర్శ్ ఏ మాత్రం లెక్కచేయడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ ఆస్తి తన పేరు పై రాయాలని డిమాండ్ చేస్తాడు ఆదర్శ్.

publive-image

Also Read: Vishwak Sen: ‘లైలా’ గా విశ్వక్ సేన్.. కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది

Advertisment
తాజా కథనాలు