Krishna Mukunda Murari Serial: ముకుందకు బుద్ది చెప్పడానికి.. కృష్ణ, మురారిలు వాళ్లకు కూడా శోభనం అంటూ ముకుందకు షాకిస్తారు. దీంతో కోపంతో రగిలిపోతున్న ముకుంద.. వెంటనే నీతో మాట్లాడాలి అని మురారికి మెసేజ్ చేస్తుంది. మురారి ఫోన్ లో మెసేజ్ చూసిన కృష్ణ.. ఈ విషయం మురారితో చెప్తుంది. ముకుందను కలిసి విషయం ఏంటో తెలుసుకోమని చెప్తుంది.
ముకుందను ప్రవర్తనకు విసిగిపోయిన మురారి.. తన మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదు.. తనను చూస్తేనే చిరాకు వస్తుంది.. నేను వెళ్ళను అని కృష్ణతో చెప్తాడు. దీంతో కృష్ణ.. వెళ్తేనే కదా తన ప్లాన్ మనకు తెలుస్తుంది అని బలవంతంగా మురారిని.. ముకుంద దగ్గరకు పంపిస్తుంది.
మురారి వెళ్ళగానే.. ఆదర్శ్ తో నాకు శోభనం క్యాన్సిల్ చేయమంటే.. నువ్వు సెట్ చేసుకొని వస్తావా అంటూ కోప్పడుతుంది ముకుంద. శోభనం జరిగితే నీకు, మాత్రమే జరగాలి.. కృష్ణను, ఆదర్శ్ ను దూరంగా పంపించేసేయ్ అంటుంది.
ముకుంద మాటలకు అసహ్యం వేసిన మురారి..నీ ప్రవర్ధన మార్చుకోవా..? నువ్వు ఏదైనా చేసుకో.. అది మాత్రం జరగదు అని ముకుందకు వార్నింగ్ ఇస్తాడు. అయితే నేను ఏం చేయాలో అదే చేస్తాను అంటూ మురారిని తిరిగి హెచ్చరిస్తుంది ముకుంద.
మరో వైపు శోభనానికి ముందు కొన్ని పూజలు చేయించాలని రెండు జంటలను గుడికి తీసుకెళ్తుంది రేవతి. అక్కడ వాళ్ళ పేర్ల ప్రత్యేక పూజలు చేయిస్తుంది.
గుడిలో పూజారి రెండు జంటలు కలకాలం సంతోషంగా ఉండాలని ఒక పూజ చేయమని చెప్తారు. భర్త కాళ్ళ.. భార్యలు కాళ్ళు పెట్టి ప్రదక్షిణలు చేయాలనీ చెప్తారు. ఆదర్శ్ పై ఇష్టం లేని ముకుంద మురారి అడుగుల్లో అడుగులు వేస్తూ ఉంటుంది. ఇది గమనించిన మధు.. ఈ విషయం కృష్ణకు చెప్తాడు. ఇంతటితో సీరియల్ ముగుస్తుంది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్