Krishna Mukunda Murari: ఇంట్లో అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. ఆదర్శ్ మాత్రం గదిలోనే ఉండిపోతాడు. దీంతో ఆదర్శ్ ఎందుకు రాలేదని అడుగుతుంది భవానీ దేవి. మురారిని ఒక రకంగా తనను మరొక రకంగా చూస్తున్నారని ఫీల్ అవుతున్నాడు అక్క అందుకే రావట్లేదు అని చెప్తుంది రేవతి. దాంతో ఆదర్శ్ ను పిలుచుకురమ్మని మధును పంపిస్తుంది భవానీ.
మరో వైపు దొంగతనంగా మురారి షర్ట్ తెచ్చుకున్న ముకుంద. ఆ షర్ట్ లో మురారిని ఊహించుకుంటూ మురిసిపోతుంది. ఇంతలో కృష్ణ అక్కడికి రాగానే కంగారు పడుతుంది. లోపలికి వచ్చిన తనను భోజనానికి రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది.
భవానీ దేవి పిలవడంతో భోజనానికి వస్తాడు ఆదర్శ్. కొడుకు రాగానే భోజనం చేయమని చెప్తుంది భవానీ దేవి. కానీ ఆదర్శ్ మనసు బాగోలేదని చెప్తాడు. దాంతో అంత కష్టం ఏమొచ్చిందని అడుగుతుంది భవానీ దేవి. దానికి ఆదర్శ్ ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో ఉంటే మనసు కష్టంగానే ఉంటుందని బదులిస్తాడు.
ఆదర్శ్ మాటలకు హార్ట్ అయిన మురారి, కృష్ణ.. అంత కష్టంగా ఉంటే ఇంట్లో నుంచి వెళ్లిపోతామని చెప్తారు. దీంతో ఆదర్శ్ తాను చెప్పింది మీరా గురించి అని అంటాడు. శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష పడకుండా చేసింది. తాను ఈ ఇంట్లో ఉండకూడదని భవానీ దేవితో వాదిస్తాడు.
ఆదర్శ్ లో తన పై కోపాన్ని గమనించిన ముకుంద.. ఎలాగైనా ఆదర్శ్ ను తన వైపుకు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుంది. అలా అయితే తాను అనుకున్నది సాదించగలనని అనుకుంటుంది.
ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన మీరా( ముకుంద) అందరికి తానే వడ్డిస్తానని చెప్తుంది. ఈ క్రమంలో ఆదర్శ్ కు ముందుగా సాంబార్ వడ్డిస్తుంది. దీంతో ఆదర్శ్ .. తాను కర్రీ కంటే ముందు సాంబార్ తో తింటానని నీకెలా తెలుసు అని మీరాను (ముకుంద) ప్రశ్నిస్తాడు. దెబ్బకు దొరికిపోయానని ఫీల్ అవుతుంది ముకుంద. ఆ తర్వాత తన ఫ్రెండ్ ముకుంద చెప్పిందని కవర్ చేస్తుంది.
అందరు భోజనం చేస్తుండగా తన ఫొటోకు దండ ఉండడం చూడలేకపోతున్న ముకుంద.. ఆ ఫొటోతో పాటు దండను కూడా తీసేయమని చెప్తుంది. ఒక్కసారిగా అందరు ఆశ్చర్యపోతారు. ఆదర్శ్ మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పావు అని మీరాను సపోర్ట్ చేస్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఆదర్శ్ ను మెల్లిగా తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుంది ముకుంద.