Krishna Mukunda Murari : కృష్ణకు దొరికిపోయిన ముకుంద .. కోపంతో రెచ్చిపోయిన ఆదర్శ్, మురారి

ముకుంద ఇంటి బయట కనిపించడంతో తనను వెతుక్కుంటూ వెళ్తాడు మురారి. మరో వైపు మురారి కంట పడకూడదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ముకుంద. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari : కృష్ణకు దొరికిపోయిన ముకుంద .. కోపంతో రెచ్చిపోయిన ఆదర్శ్, మురారి

Krishna Mukunda Murari: ముకుంద కృష్ణ కారణంగానే చనిపోయిందని భావిస్తున్న ఆదర్శ్ ఆమెను నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. తన జీవితాన్ని నాశనం చేసిందని.. ముకుంద అడ్డు తొలగించుకోవడానికి అబద్దం చెప్పి తనను తీసుకొచ్చిందని కృష్ణను నిందిస్తాడు.

publive-image
ఇంట్లో రేవతి, నందిని ఎంత చెప్పిన వినిపించుకోకుండా కృష్ణను సూటిపోటి మాటలతో భాదపెడతాడు ఆదర్శ్. కృష్ణ సమాజంలో తిరుగుతున్న క్రూర జంతువని.. మేకవన్నె పులి అంటూ కృష్ణను ఘోరంగా అవమానిస్తాడు. ఏ తప్పు చేయని కృష్ణ ఆదర్శ్ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటుంది.

publive-image
మరో వైపు బ్రతికే ఉన్న ముకుంద ఆమె తండ్రితో కలిసి మురారి ఇంటికి వస్తుంది. ఇంటి బయట నిల్చున్న ముకుంద.. మురారికి భార్యగా, ఇంటి కోడలి హోదాలో ఉండాల్సిన దాన్ని, కాంపౌండ్ బయట ఉన్నాను. ఈ పరిస్థితికి కారణమైన కృష్ణ వదిలిపెట్టను అని మనసులో అనుకుంటుంది.

publive-image
ఇంటి గుమ్మము ఎదురుగా నిలబడిన ముకుంద సడెన్ గా మురారి కంటికి కనిపిస్తుంది. దీంతో మురారి షాక్ అవుతాడు. ఆమె కోసం బయటకు పరుగు తీస్తాడు. ఇంతలో ముకుంద మాయం అవుతుంది.

publive-image

మురారి కంట పడిన ముకుంద అతడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రేవతి, కృష్ణ, మధు చిక్కులో పడిపోతుంది. అందరు తన వైపే వస్తుండడంతో.. దొరికిపోతానేమోనని టెన్షన్ పడుతుంది ముకుంద. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image
ఆ తర్వాత గదిలోకి వచ్చిన మురారి.. ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ముకుంద చనిపోయింది కదా.. మళ్ళీ ఎలా కనిపించింది..? ఇందంతా నా భ్రమా..? నిజమా..? నేనేదో తనకు అన్యాయం చేసినట్లు ఆమె చూపులు చెప్తున్నాయి అని మనసులో అనుకుంటాడు మురారి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్ లో ముకుంద విషయంలో ఆదర్శ్.. కృష్ణను నిందించడం నచ్చని మురారి.. అతని పై కోప్పడతాడు. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది.

publive-image

Also Read: Amitabh Bachchan: అదంతా ఫేక్ న్యూస్.. అనారోగ్యం పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్‌ బచ్చన్‌

Advertisment
తాజా కథనాలు