Krishna Mukunda Murari Serial : మురారి కోసం ముకుంద మాస్టర్ ప్లాన్.. రూపం మార్చుకొని మళ్ళీ ఇంట్లోకి ఎంట్రీ..! మురారిని సొంతం చేసుకోవడానికి ఊహించని ప్లాన్ వేస్తుంది ముకుంద. తను నిజంగానే చనిపోయిందని అందరూ నమ్మేలా చేస్తుంది. మరో వైపు ముకుంద చావుకు కృష్ణే కారణమని ఆమె పై కోపంతో రగిలిపోతాడు ఆదర్శ్ . ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 15 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Krishna Mukunda Murari Serial Today Episode : ముకుంద(Mukunda) చనిపోయిందన్న బాధతో.. ఆమె తండ్రి శ్రీనివాస్(Srinivas) హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే.. ఇంట్లో ముకుందను చూసి షాకవుతాడు. దీంతో ముకుంద.. ఏంటీ నాన్న చనిపోయిన కూతురు ఎలా వచ్చిందని భయపడుతున్నావా ..? లేదా పోయిన దరిద్రం మళ్ళీ ఎలా వచ్చిందని భాదపడుతున్నావా..? అని అడుగుతుంది. నిన్ను చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చిందమ్మ అని చెప్తాడు శ్రీనివాస్. మురారి(Murari) ఎలాగైనా దక్కించుకోవాలని ఊహించని ప్లాన్ వేస్తుంది ముకుంద. తాను చనిపోయిందని అందరినీ నమ్మిస్తుంది. రూపం మార్చుకొని మళ్ళీ మురారి జీవితంలోకి వెళ్లాలని మాస్టర్ స్కెచ్ వేస్తుంది. ఇది వినగానే ముకుంద తండ్రి శ్రీనివాస్ కూడా షాకవుతాడు. తన కూతురి సంతోషం కోసం ఆమె చేసే పనికి సపోర్ట్ గా ఉంటానని చెప్తాడు. మరో వైపు భార్య పోయిందన్న బాధలో తన ఫ్రెండ్ తో కలిసి మందు తాగుతుంటాడు ఆదర్శ్. తన జీవితం ఇలా మారడానికి కృష్ణే కారణమని రెచ్చగొడతాడు ఆదర్శ్ ఫ్రెండ్. ఇక కృష్ణ పై కోపంతో రగిలిపోతున్న ఆదర్శ్.. ఆమెను ఈ జన్మలో క్షమించను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముకుంద చనిపోయిందని భావిస్తున్న కృష్ణ తన ఆలోచనలతో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రేవతి, నందు కృష్ణను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. కృష్ణ పై కోపంతో రగిలిపోతున్న.. అందరి ముందు తనను నోటికివచ్చినట్లు మాట్లాడతాడు. ముకుంద చావుకు కృష్ణే కారణం అంటూ తనను నిందిస్తాడు. మా ఇద్దరినీ కలపాలని కాదు.. నీ స్వార్థం కోసం నన్ను తీసుకొచ్చావు. ముకుందకు నేనంటే ఇష్టం లేదని తెలిసి కూడా ఇందంతా చేశావు అని కృష్ణను ఇష్టం వచ్చినట్లు తిడతాడు. దీంతో కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ముకుంద.. ఇంటి బయట నిల్చొని ఉంటుంది. ఇంతలో మురారికి చూడగానే.. తనకు కనిపించకుండా దాక్కోవాలని ప్రయత్నిస్తుంది. Also Read : Surekha Vani: ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి #krishna-mukunda-murari-today-episode #tv-serial #daily-serial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి