Krishna Mukunda Murari: ముకుంద చావు నిజమేనా..? మరో మలుపు తిరగనున్న కృష్ణ, మురారిల జీవితం

ముకుంద ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో రేవతి కుప్పకూలిపోతుంది. మరో వైపు తన కూతురి చావుకు మురారి కుటుంబమే కారణమని నిందిస్తాడు ముకుంద తండ్రి శ్రీనివాస్. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari: ముకుంద చావు నిజమేనా..? మరో మలుపు తిరగనున్న కృష్ణ, మురారిల జీవితం

Krishna Mukunda Murari: భార్య ముకుంద, మురారి కలిసి ఉన్న ఫోటోలను కాల్చేస్తాడు ఆదర్శ్. ఇంతలో అక్కడికి వచ్చిన రేవతి, మధు వాటిని చూసి కంగారు పడతారు. మంటలు చూసిన రేవతి టెన్షన్ తో వాటిని ఆపేయమని మధుతో చెప్తుంది. దీంతో ఆదర్శ్.. అవి కాలిపోతేనే నా గుండెల్లో మంట చల్లారుతుందని అంటాడు. కాలుతున్న మంటలో మురారి నవ్వుతున్నట్లు ఊహించుకున్న ఆదర్శ్.. నన్ను ఏడిపించి నవ్వుతున్నారు అంటూ పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తాడు.

Krishna Mukunda Murari Krishna Mukunda Murari

మరో వైపు ముకుందను వెతుక్కుంటూ వెళ్లిన కృష్ణ, మురారి తను కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వస్తారు. ఇక్కడ చూస్తే ముకుంద కనిపించడంలేదు.. అక్కడ ఆదర్శ్ పరిస్థితేమో అలా ఉంది.. ఈ కుటుంబానికి ఏదో కీడు జరగబోతుంది అని ఏడుస్తుంది రేవతి.

Also Read: Kiran Abbavaram : గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం – రహస్య ఎంగేజ్మెంట్.. వైరలవుతున్న ఫొటోలు

Krishna Mukunda Murari
రేవతి భయపడుతుండగానే టీవీలో 30 ఏళ్ళ యువతి ఆత్మహత్య చేసుకుందని న్యూస్ వస్తుంది. అది ముకుందే అని ఫిక్స్ అయిన రేవతి షాక్ తో కుప్పకూలిపోతుంది. దీంతి కృష్ణ.. అది ముకుందనే అని కన్ఫర్మ్ కాదు కదా.. అంతవరకు ఈ విషయం ఆదర్శ్ కు తెలియకుండ ఉంచాలని చెప్తుంది.

publive-image
కృష్ణ మాటలు విన్న ఆదర్శ్ నీకు దాచడం బాగా అలవాటైపోయింది. మనుషులను అబద్ధాల్లో ఉంచడం నీకు బాగా అలవాటు అని అంటాడు. దీంతో మురారి.. ఆదర్శ్ ను ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ మురారి మాటలు ఏ మాత్రం లెక్కచేయడు ఆదర్శ్. ముకుందకు నేనంటే ఇష్టం లేదని తెలిసి కూడా నన్ను మోసం చేసింది. ఇప్పుడు నా భార్య చావుకు కృష్ణే కారణం అంటూ ఆమెను నిందిస్తాడు.

Krishna Mukunda Murari
చనిపోయింది ముకుందనా ..? కాదా..? అని కన్ఫమ్ చేసుకోవడానికి అందరు హాస్పిటల్ కు వెళ్తారు. ఇంతలో ముకుంద తండ్రి శ్రీనివాస్ తన చనిపోయిందనే నిజాన్ని చెప్తాడు. తన కూతురు చావుకు కారణం మురారి కుటుంబమే అని నిందిస్తాడు. నా కూతురి శవాన్ని చూసే అర్హత మీకు లేదని.. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: RRR Movie: జపాన్‌కు రాజమౌళి.. అక్కడ ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజ్‌ పీక్స్‌.. నిమిషంలోపే టికెట్స్‌ సేల్‌..!

Advertisment
తాజా కథనాలు