Krishna Mukunda Murari: చనిపోయిన ముకుంద.. కృష్ణ ఏం చేయనుంది ..?

ఇంట్లో అందరి ముందు కృష్ణ చేసిన అవమానం తట్టుకోలేకపోయిన ముకుంద ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మరో వైపు కోపంతో రగిలిపోతున్న ఆదర్శ్ తన భార్య వెళ్లిపోవడానికి కృష్ణే అంటూ నిందిస్తాడు. తన జీవితం నాశనం చేసిందని కృష్ణను అసహ్యించుకుంటాడు.

New Update
Krishna Mukunda Murari:  చనిపోయిన ముకుంద.. కృష్ణ ఏం చేయనుంది ..?

Krishna Mukunda Murari: ముకుంద ఇంట్లో అందరి ముందు మురారి అంటే ఇస్తామని చెప్పేస్తుంది. అంటే ఇప్పుడు నా భర్తను నీ చేతిలో పెట్టి పంపాలా..? సిగ్గుండాలి ఇలా మాట్లాడడానికి అని ముకుందకు గడ్డి పెడుతుంది కృష్ణ. దీంతో ముకుంద.. నాకెందుకు సిగ్గు నీకు భర్త కాకముందు.. మురారి నా ప్రియుడు. అందుకే నా నా ప్రియుడిని నేను కావాలని కోరుకుంటున్నాను తప్పేంటి? అని అసహ్యంగా మాట్లాడుతుంది.

publive-image
ముకుంద మాటలకు విరక్తి చెందిన కృష్ణ.. ఇలాంటి ఆడదాన్ని ఎక్కడ చూడలేదు..? మొహం పై ఉమ్మేయాలనిపిస్తుంది అని అంటుంది. దీంతో కృష్ణ పై చెయ్యి ఎత్తుతుంది ముకుంద. ఇక కృష్ణ.. నీ సిగ్గులేని జన్మకు మళ్ళీ పౌరుషం ఒకటి.. సిగ్గు, పరువు, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా.. నీది ఒక బతుకేనా అని ముకుందను ఘోరంగా అవమానిస్తుంది.

publive-image
ఇంట్లో అందరి ముందు అవమానం తట్టుకోలేకపోయిన ముకుంద ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వెళ్లేముందు ఇంతకింత అనుభవిస్తావని కృష్ణకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.

publive-image
ముకుంద వెళ్ళగానే కృష్ణ, మురారిల ఆరోపణలు మొదలు పెడతాడు ఆదర్శ్. తను వెళ్ళిపోయింది.. మీకు ఇప్పుడు సంతోషంగా ఉందా..? అసలు మీరు మనుషులేనా అని కోపంగా వెళ్ళిపోతాడు.

publive-image
ముకుంద చేసిన పని తలుచుకొని భాదపడుతూ ఉంటుంది కృష్ణ. ఇక భవానీ దేవికి ఏం సమాధానం చెప్పాలి అని మురారి టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో ఆదర్శ్ కూడా బ్యాగ్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు.

publive-image
కృష్ణ, మురారి ఆదర్శ్ ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపాలని ప్రయత్నిస్తారు. కానీ ఆదర్శ్ మాత్రం వాళ్ళ మాట వినిపించుకోడు. ముకుంద మనసులో లేనని తెలిసాక.. ఇక్కడ ఉండడం అనవసరం అని అంటాడు. అసలు ఇదంతా జరగడానికి కృష్ణే కారణమని నిందిస్తాడు.

publive-image

ముకుంద ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తన కోసం ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ. కోపం తగ్గిన తర్వాత తానే తిరిగి వస్తుందిలే అని కృష్ణకు దైర్యం చెప్తాడు మురారి.

publive-image
భార్య మనసులో స్థానం లేదని తెలుసుకున్న ఆదర్శ్.. ముకుంద మాటలు తలుచుకుంటూ బాధపడతాడు. మోసాన్ని తట్టుకోలేకపోతున్న ఆదర్శ్ ఉదయాన్నే మందు తాగడం మొదలు పెడతాడు. ఇది చూసి కృష్ణ, మురారి టెన్షన్ పడతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ముకుంద చనిపోయిందనే వార్త తెలుస్తుంది.

publive-image

Also Read: Operation Valentine: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Advertisment
తాజా కథనాలు