Krishna Mukunda Murari Serial: ఆదర్శ్ రావడం ఫిక్స్.. ముకుందకు మూడినట్లేనా..!

కృష్ణ మురారీ శోభనం ముకుంద కారణంగా ఆగిపోయింది. ఆదర్శ్ వస్తాడని.. త్వరలో తీసుకొస్తామని.. మూడు రోజుల్లో ఆదర్శ్ సమాచారం దొరికిపోతుందని కృష్ణ అంటుంది. ఆ మాటలకు ముకుంద టెన్షన్ పడుతుంటుంది. ఆదర్శ వస్తే హ్యాపీ అని బయటికి అంటున్నా తనలో తాను ఇబ్బంది పడుతుంటుంది.

New Update
Krishna Mukunda Murari Serial: ఆదర్శ్ రావడం ఫిక్స్.. ముకుందకు మూడినట్లేనా..!

Krishna Mukunda Murari Serial: కృష్ణ మురారీ శోభనం ముకుంద కారణంగా ఆగిపోతోంది. ముకుంద ఏడుస్తూ నటించిగా కృష్ణ తన బాధను అర్థం చేసుకుని  శోభనం క్యాన్సిల్ చేస్తుంది. ఆదర్శ వచ్చాకే మాకు ముహుర్తం బాగుంటుందని అందరికి నచ్చజెప్పుతుంది. ఈ నిర్ణయం కారణంగా మురారీ తల్లి బాగా ఫీల్ అవుతుంది. కృష్ణ ఇలా చేయడం తప్పు అని తింటుకుంటుంది.

publive-image

Also Read: శేఖర్ కమ్ముల మల్టీ స్టారర్.. ధనుష్ తో పాటు మరో అగ్ర హీరో

నటిస్తోన్న ముకుంద

మురారీ, కృష్ణలతో పెద్దత్తయ్య భవానీ దేవి, అత్త రేవతీలు కోపంగా మాట్లాడుతుంటారు. ఇది గమనించిన ముకుంద ఎమోషనల్ గా మాట్లాడుతూ నా వల్లే శోభనం ఆగిపోయిందని కృష్ణకు సారీ చెప్పి ఏడుస్తున్నట్లు నటిస్తుంది. నా వల్లే ఇదంతా అంటూ ఫీల్ అవుతుంది. కృష్ణ ముకుందను ఓదారస్తు ఇలా మాట్లాడుతుంది.. ఆదర్శ్ తప్పకుండా వస్తాడు.. త్వరలో తీసుకొస్తామని.. మూడు రోజుల్లో ఆదర్శ్ సమాచారం దొరికిపోతుందని అంటుంది. దీంతో ముకుందా బాగా ఫీల్ అవుతుంది.

Krishna Mukunda Murari Serial

ఆదర్శ్ వస్తాడా?

ఎందుకంటే పైకి మారినట్లు నటిస్తున్న ముకుందకు మురారీ, కృష్ణ కలిసి సంతోషంగా ఉండటం ఇష్టం ఉండదు.. అందరితో ఆదర్శ్ వస్తే అంతకన్నా సంతోషం ఏమీ ఉంటుందని చెబుతున్నా..నిజంగా ఆదర్శ్ వస్తాడా? అని భయం భయంగా ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. నిజానికి ఆదర్శ్ వస్తే ముకుంద దారిలో పడుతుందని ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటారు.

publive-image

విడగొట్టాలనే

ఎన్నో ప్లాన్స్ వేస్తున్న కృష్ణ మురారీని ముకుంద విడగొట్టలేకపోతుంది. పగతో సాధించలేనిది ప్రేమతో సాధించుకోవచ్చనే సామెతను ముకుంద ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఎమోషనల్ గా నటిస్తునే వారిద్దరిని దూరం చేసి తాను పెళ్లి చేసుకోవచ్చని స్కెచ్ వేసి ఉంటుందని ఇంట్లో వాళ్లు ఫీల్ అవుతుంటారు. కచ్చితంగా ఆదర్శ్  ఆచూకి మూడు రోజుల్లో తెలుస్తుందని..ముకుందకు ఆదర్శ్ రాకతో తిక్క కుదురుతుందని అంటున్నారు.

publive-image

Also Read: ఉలిక్కిపడ్డ శ్వేత.. అర్ధరాత్రి ఆమె ఇంటికి రాజ్.. కావ్యకు తప్పని తిప్పలు..!

Advertisment
తాజా కథనాలు