Brahmamudi Serial: ఉలిక్కిపడ్డ శ్వేత.. అర్ధరాత్రి ఆమె ఇంటికి రాజ్.. కావ్యకు తప్పని తిప్పలు..! బ్రహ్మముడి సీరియల్ లో ఇంట్లో ఎదురుతిరగమని కావ్యకు తన అక్క స్వప్న సలహా ఇస్తుంది. మరోవైపు శ్వేత ఇంటికి రహస్యంగా ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెను భయపెడుతుంటాడు. దీంతో రాజ్ ఆఫీస్ కు కాకుండా శ్వేత ఇంటికి వెళ్లిపోతాడు. By Jyoshna Sappogula 19 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లో రాత్రిపూట కావ్య (Kavya) డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అక్క స్వప్న కావ్య దగ్గరకు వెళ్లి..నువ్ ఎందుకే ఈ పనులన్నీ చేస్తున్నావ్.. పని మనిషి ఏమైందని అడుగుతుంది. ఇప్పటిదాకా పనిమనిషి ఎందుకు ఉంటుందే వెళ్లిపోయిందని అంటుంది. పనిమనిషి లేదని నువ్ చేస్తావా? ఇలాగే చేస్తూ ఉంటే నీతో బాత్రూమ్లు కూడా క్లీన్ చేయిస్తారని అంటుంది. ఎందుకే ఇలా పనిమనిషిలా పనులు చేస్తావ్ ఈ ఇంట్లో ఎవరైనా నిన్ను గౌరవంగా చూస్తున్నారా? అని స్వప్న అంటుంది. దీంతో కావ్య.. మన పనులు మనం చేసుకోకుంటే ఎలా అక్క అంటూ నీతి సామెతలు చెబుతుంది. కనకంకు అవమానం మరోవైపు కనకం ఇంటికి వాళ్ల పక్కింటి ఆవిడా తన కూతురి పెళ్లి అని వచ్చి పత్రిక ఇస్తుంది. అల్లుడు ఏం చేస్తాడు? అని అడిగితే..చిన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం అక్క..నీలా కూతుర్లను పెద్ద ఇంటికి కోడలిగా పంపించేంత తెలివి తేటలు లేవుగా..అప్పును కూడా ప్రేమ నాటకం ఆడి కళ్యాణ్ తో పెళ్లి చేయాలని చూశావ్ కదా అని కామెంట్ చేస్తుంది. దీంతో కనకం ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతుంది. శ్వేత ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి ఇదిలా ఉండగా అర్థరాత్రి 11 గంటలకు రాజ్ ఆఫీస్ వర్క ఉందని రెడీ అయి వెళ్లిపోతాడు. కానీ అప్పుడే శ్వేత ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చినట్లు షాడో చూపిస్తారు. కానీ అతడు ఎవరు అనే ఏమీ చూపించరు. దీంతో, శ్వేత (Swetha) ఇంట్లో టెన్షన్ పడుతు ఉంటుంది. అప్పుడే రాజ్ (Raj) కాల్ చేస్తాడు. శ్వేత వాయిస్ టెన్షన్ గా ఉందని ఆమె ఇంటికి వెళ్తాడు. తనకు ధైర్యం చెబుతాడు. రాజ్ శ్వేతతో ఉంటున్నప్పుడు ఆ గుర్తి తెలియని వ్యక్తి వీడియో తీస్తాడు. ఆ వీడియో కావ్యకు పంపిస్తాడు. దీంతో కావ్య షాక్ అవుతుంది. ఏ రిలేషన్ ఉండదు ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. అయితే, ఈ శ్వేత విషయంపై సీరియల్ అభిమానులకు క్లారిటీ రావడం లేదు. మళ్లీ శ్వేత ఇంటికి కొత్తగా ఒక వ్యక్తి వచ్చినట్లు చూపించారు. మరి ఆ వ్యక్తి ఎవరు అనే సస్పెన్స్ పెట్టారు. అయితే, రాజ్ శ్వేతకు ఒక ఫ్రెండ్ గా సపోర్టు ఉంటున్నాడే తప్ప..తనకు శ్వేతతో ఏ రిలేషన్ ఉండదని అభిమానులు అనుకుంటున్నారు. Also Read: ఆ OTT సంస్థతో ఒప్పందం ఫిక్స్.. pushpa-2 నుంచి అదిరే అప్డేట్ #brahmamudi-serial-latest-episode #brahmamudi-serial #brahmamudi-serial-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి