Krishna Mukunda Murari: ముకుంద మోసానికి బలైన కృష్ణ, ఆదర్శ్.. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మురారి

ముకుంద నాటకం గురించి తెలిసిపోయిన మురారి.. ఆదర్శ్ జీవితం ఏమైపోతుందా..? అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో వైపు నిజం తెలియని కృష్ణ.. ఆదర్శ్, ముకుంద సంతోషంగా ఉన్నారని అనుకుంటుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Krishna Mukunda Murari: ముకుంద మోసానికి బలైన కృష్ణ, ఆదర్శ్.. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మురారి
New Update

Krishna Mukunda Murari:  జాగింగ్ కోసం వెళ్లిన మురారి ఇంటికి రాకపోవడంతో హాల్లో ఎదురుచూస్తూ ఉంటుంది. మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు అని అత్తయ్య రేవతిని ప్రశ్నిస్తుంది. మగవారికి బయట ఎన్నో పనులు ఉంటాయి.. టైం కి రావాలి అంటే కొన్ని సార్లు కుదరదు అని చెప్తుంది రేవతి.

publive-image

ఇంతలో ముకుంద ఇంటికి వస్తుంది. ముకుంద కూడా వాకింగ్ కి వెళ్లిందని తెలుసుకున్న కృష్ణ మురారి కనిపించాడా..? అని అడుగుతుంది. అసలు విషయం తెలిసిన ముకుంద.. నేను ఇచ్చిన షాక్ తో ఇప్పట్లో మురారి ఇంటికి రాడు. ఆ షాక్ నుంచి తేరుకొని ఇంటికి రావడానికి కాస్త టైం పడుతుందిలే అని మనసులో అనుకుంటుంది.

publive-image

ఆ తర్వాత ముకుంద.. కృష్ణను కాఫీ కావాలని అడుగుతుంది. మురారి కోసం తెచ్చిన కాఫీనే.. తాగమని ముకుంద ఇస్తుంది కృష్ణ. దీంతో ముకుంద.. ఈరోజు మురారి కాఫీ ఇచ్చావు.. రేపు మురారిని కూడా ఇవ్వాల్సి వస్తుందేమో కృష్ణ అంటూ దురాలోచన చేస్తుంది.

publive-image
మరో వైపు ఒంటరిగా ఉన్న మురారి.. ఆదర్శ్ అంటే ఇష్టం లేదని ముకుంద చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో ఈ విషయం కృష్ణకు తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగైనా ముకుంద ఆదర్శ్ ను ఒకటి చేయాలనీ అనుకుంటాడు.

publive-image
ఒంటరిగా కూర్చున్న ముకుంద దగ్గరకు.. ఆదర్శ్ రాగానే చిరాకుగా ఫీల్ అవుతుంది. ఇంతలో ఆదర్శ్ కోసం కాఫీ తెచ్చిన కృష్ణ.. ఆ కాఫీనీ ఇద్దరు చేసుకోండి అని చెప్తుంది. ఆదర్శ్ అంటే ఏ మాత్రం ఇష్టం లేని ముకుంద.. నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు కృష్ణ అని తిట్టుకుంటుంది.

publive-image
ముకుంద ప్రేమను నిజమని నమ్ముతున్న ఆదర్శ్.. శోభనం గురించి కళలు కంటూ ఉంటాడు. ఆదర్శ్ ను అలా సంతోషంగా చూసిన మురారి.. నిజం తెలిస్తే ఏమైపోతాడో అని టెన్షన్ పడతాడు.

publive-image
మురారికి నిజం చెప్పేసిన ముకుంద.. ఎలాగైనా సరే మురారి శోభనం ఆపేస్తాడు అని సంతోషంగా ఉంటుంది. మరో వైపు అక్కడికి వచ్చిన ఆదర్శ్.. నా ఫ్రెండ్స్ కలవడానికి రమ్మంటున్నాడు అని ముకుందతో చెప్తాడు. భర్తతో శోభనం ఇష్టం లేని ముకుంద సంతోషంగా వెళ్ళమని చెప్తుంది. కానీ ఆదర్శ్.. శోభనం పెట్టుకొని ఎలా వెళ్ళను.. కుదరదు అని చెప్పేశానని ముకుందకు షాకిస్తాడు. దీంతో మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని డిసప్పాయింట్ అవుతుంది ముకుంద. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

#krishna-mukunda-murari-today-episode #krishna-mukunda-murari
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe