Krishna Mukunda Murari: ప్రియుడి కోసం..భర్తతో శోభనం క్యాన్సిల్.. మరో కొత్త నాటకం మొదలు పెట్టిన ముకుంద

మురారినే ప్రేమిస్తున్న ముకుంద.. భర్తతో శోభనం క్యాన్సిల్ చేయడానికి కాలికి దెబ్బ తగిలినట్లు నటిస్తుంది. భార్య నిజంగానే గాయపడిందని నమ్మిన ఆదర్శ్.. టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Krishna Mukunda Murari: ప్రియుడి కోసం..భర్తతో శోభనం క్యాన్సిల్.. మరో కొత్త నాటకం మొదలు పెట్టిన ముకుంద
New Update

Krishna Mukunda Murari Serial Today Episode:  భర్తతో పై ప్రేమ లేని ముకుంద శోభనం ఎలా క్యాన్సిల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఇష్టం లేని వ్యక్తితో ఇంకా ఎన్నాళ్ళు కలిసి ఉండాలి అని బాధపడుతుంది. మురారి రూపం మారిన.. నాకు తన పై ప్రేమ మాత్రం తగ్గలేదు.. తాను ఎప్పటికీ నా వాడే అని మనసులో అనుకుంటుంది ముకుంద.

publive-image

ఇంతలో ఆదర్శ్ వస్తున్నాడని గమనించిన ముకుంద.. శోభనం క్యాన్సిల్ చేయడానికి కాలికి దెబ్బ తగిలినట్లు నటిస్తుంది. భార్యకు నిజంగానే గాయమైందని ఫీలైన ఆదర్శ్ టెన్షన్ పడతాడు. ముకుందను ఎత్తుకొని రూమ్ లోకి తీసుకెళ్తాడు.

publive-image

ముకుందకు దెబ్బతగలడంతో కృష్ణ కంగారు పడుతుంది. ఆదర్శ్ ముకుంద.. కాలు పట్టుకొని చూస్తాడు. భర్త తనను ముట్టుకోవడం ఇష్టంలేని ముకుంద వద్దని చెబుతుంది. దీంతో కృష్ణ.. తాను నీ భర్తే కదా ముట్టుకుంటే తప్పేమేమీ లేదని ముకుందను హెచ్చరిస్తుంది.

publive-image

మరో వైపు తన కొడుకు, కోడలు సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మధు.. ముకుంద నాటకాలను కృష్ణ గుడ్డిగా నమ్ముతుంది.. దీని వల్ల తాను ఏదో ఒక రోజు ఇబ్బందులు పడక తప్పదని రేవతితో చెబుతాడు. దీంతో రేవతి మరింత టెన్షన్ పడుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode

కాలికి దెబ్బ తగిలినట్లు నటిస్తున్న ముకుంద.. అది మర్చిపోయే సడన్ లేచి నడుస్తుంది. ఇంతలో కృష్ణ చూసిందని గమనించిన ముకుంద.. మళ్ళీ నొప్పి ఎక్కువైనట్లు నటన మొదలు పెడుతుంది. ముకుంద ప్రవర్తన పై అనుమానం వచ్చిన కృష్ణ.. శోభనం ఇష్టం లేక ఇలా చేస్తుందా.. ? అని డౌట్ పడుతుంది.

publive-image

మరో వైపు కృష్ణను కిడ్నాప్ చేయడానికి.. ముకుంద అన్న దేవ్ కొంత మంది రౌడీలను రిసార్ట్ కు పంపిస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode

సరదాగా గడపడానికి రిసార్ట్ కు వెళ్లిన రెండు జంటలు.. ముకుంద కాలికి గాయం కావడంతో తిరిగి ఇంటికి బయలుదేరుతారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode

Also Read: Sharmila Son Raja Reddy Marriage: కుమారుడు రాజారెడ్డి పెళ్ళి వేడుకల్లో డాన్స్ వేస్తున్న షర్మిల.. వైరలవుతున్న ఫొటోస్

#krishna-mukunda-murari-today-episode #krishna-mukunda-murari
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe