Krishna Mukunda Murari Today Episode : గుడిలో ధ్వజస్థంభం నుంచి గంట కింద పడడం గురించి కృష్ణ(Krishna) ఇంకా భయపడుతూ ఉంటుంది. కృష్ణ టెన్షన్ గా ఉండడంతో ఆదర్శ్(Adarsh), మురారి(Murari) తనకు దైర్యం చెప్తారు. ఆ తరువాత ప్రసాదం తినాలని ఆదర్శ్ కొబ్బరి చిప్పను కొడుతుండగా.. చేయికి దెబ్బ తగులుతుంది. దీంతో కృష్ణ మురారి టెన్షన్ పడతారు. ముకుంద మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా ఏదో ధ్యాసలో ఉంటుంది.
ముకుంద(Mukunda) అలా ఉండడం గమనించిన కృష్ణ.. ఆదర్శ్ చేతికి దెబ్బతగిలితే చూడకుండా ఏం ఆలోచిస్తున్నావు అని ముకుంద పై అరుస్తుంది. పరధ్యానంగా ఉన్న ముకుంద.. ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకుంటుంది. మురారి చేతికే దెబ్బతగిలినట్లు ఫీల్ అవుతూ టెన్షన్ పడుతుంది. ఇది తెలియని కృష్ణ, మురారి, ఆదర్శ్ పై ముకుంద ప్రేమను చూసి నిజంగానే మారిందని అనుకుంటారు.
Also Read : Eagle Trailer: “దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను”.. ఆసక్తికరంగా ఈగల్ ట్రైలర్
గుడి నుంచి రెండు జంటలు కలిసి రెస్టారెంట్ కు బయలుదేరుతారు. దారి మధ్యలో కృష్ణ.. మల్లెపూలు కొనడానికి కారు ఆపుతుంది. కృష్ణ.. తనకు, ముకుందకు మల్లెపూలు కొంటుంది. ఆదర్శ్ , ముకుందలను దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్న కృష్ణ.. ముకుంద జడలో ఆదర్శ్ ను మల్లెపూలు పెట్టమని చెబుతుంది. దీంతో ముకుంద చిరాకుగా ఫీల్ అవుతుంది. కానీ కృష్ణను నమ్మించడానికి ఆదర్శతో పూలు పెట్టించుకుంటుంది.
ఆ తరువాత అందరు కలిసి రెస్టారెంట్ కు వస్తారు. ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ముకుంద మాత్రం మురారి గురించే ఆలోచిస్తూ ఏదో ధ్యాసలో ఉంటుంది. ఇంతలో ఫుడ్ వచ్చేస్తుంది. ఆదర్శ్ చేతికి గాయం కావడంతో తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇది గమనించిన కృష్ణ.. ముకుందను ఆదర్శ్ కు తినిపించమని చెబుతుంది. ఆదర్శ్ అంటే ఇష్టం లేని ముకుంద ఇబ్బంది పడుతుంది.
ఇంకా మురారినే మనసులో పెట్టుకున్న ముకుంద.. ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకొని ప్రేమగా ఫుడ్ తినిపిస్తుంది. ఆదర్శ్ పై ముకుంద ప్రేమను చూసిన.. కృష్ణ ,మురారి ఇందంతా నిజమేనని నమ్ముతారు. కానీ ముకుంద మాత్రం ఇంకా మురారినే ప్రేమిస్తూ అందరిని మోసం చేస్తుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read : Buchi Babu : రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో