Krishna Mukunda Murari Serial: ఇష్టం లేదని భర్తకు షాకిచ్చిన ముకుంద.. కృష్ణ భయమే నిజం కానుందా..! ముకుంద పై ప్రేమను పెంచుకుంటున్న ఆదర్శ్.. భార్యకు ప్రపోజ్ చేస్తాడు. కానీ భర్త పై ప్రేమ లేని ముకుంద.. ఇష్టం ఉన్నట్లు నటించడం నరకంగా ఉందని ఫీల్ అవుతుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 06 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Krishna Mukunda Murari Serial: కృష్ణ ఇంట్లో దీపం వెలిగిస్తుండగా.. పూజ గదిలో మంటలు రావడంతో మరో సారి ఏదో కీడు జరగబోతుందని భయపడుతుంది. వెంటనే మురారి దగ్గరకు వెళ్లి గుడికి వెళదామని చెబుతుంది. మురారి ఇప్పుడు కుదరదు అని చెప్పినా సరే వినకుండా గుడికి తీసుకెళ్తుంది. భర్త కోసం పూజ చేస్తుండగా దీపం ఆరిపోయిన విషయాన్నీ పంతులు గారికి చెబుతుంది. దాంతో పూజారి కృష్ణకు ఒక మంత్రం చెప్పి.. దాన్ని మనసులో అనుకుంటూ దీపం వెలిగించమని చెబుతారు. పంతులు గారు చెప్పినట్లే దేవుడి ముందు హారతి కర్పూరం వెలిగించి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటుంది కృష్ణ. Also Read: Sitara Dance Video: నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్! కృష్ణ కళ్ళు తెరిచి చూసే లోపు.. ఒక్కసారిగా దీపం ఆరిపోతుంది. దీంతో కృష్ణ భయం మరింత పెరిగిపోతుంది. ఎందుకిలా జరుగుతుందని కంగారుపడుతుంది. గాలికి దీపం ఆరుతుంది కానీ కర్పూరం ఆరదు కదా అని కంగారుగా పూజారిని అడుగుతుంది. దేవుడు రాసిన రాతను ఎవరూ మార్చలేరు.. దాన్ని ఎవరైనా ఎదురుకోవాల్సిందే.. దేవుడి పైనే భారం వేస్తే అంతా ఆయనే చూసుకుంటాడు అని కృష్ణకు సర్ది చెప్తాడు పూజారి. ఆ తర్వాత పూజారి కృష్ణను చూస్తూ.. నీ జీవితంలో జరగబోయే కీడును ముందే చెప్పి.. నిన్ను ఇంకా భయపెట్టలేనమ్మా అని మనసులో అనుకుంటాడు. మరో వైపు ఆదర్శ్ అంటే ఇష్టంలేని ముకుంద వాలెంటైన్ కాంపిటీషన్ లో ఎలా పాల్గొనాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమలేని ఆదర్శ తో ఒకే గదిలో ఉండడమే నరకంగా ఉంది. ఇక కాంపిటీషన్ లో తనతో ఉండడం నా వల్ల కాదు.. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రూమ్ లోకి వచ్చిన ఆదర్శ్.. గులాబీలు చేతిలో పట్టుకొని మోకాళ్ళ పై కూర్చొని ముకుందకు ఐలవ్యూ చెప్తాడు. ఆదర్శ్ ఇలా చెప్పడంతో ముకుంద షాక్ అవుతుంది. ఇప్పుడు వాలెంటైన్స్ డే ఏంటీ అని ఆదర్శ్ ను అడుగుతుంది. కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్తాడు. ముకుంద మాత్రం మొహం చిరాకుగా పెట్టుకొని ఉంటుంది. ముకుంద అలా ఉండడంతో ఆదర్శ్ ఏమైందని ప్రశ్నిస్తాడు. దీంతో ముకుంద నాకు కాంపిటీషన్ లో పాల్గొనడం ఇష్టం లేదని ఆదర్శ్ కు షాకిస్తుంది. నీ ఇష్టంతోనే కదా నేను.. ఇక్కడకు వచ్చింది.. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని నిలదీస్తాడు ఆదర్శ్. ముకుంద ఏవో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. గుడి నుంచి తిరిగి వస్తున్న కృష్ణ, మురారి కాఫీ కోసం రెస్టారెంట్ కు వెళ్తారు. కృష్ణ మాత్రం దీపం ఆరిపోవడంతో ఏదో కీడు జరుగుతుందని ఆలోచిస్తూ డల్ గా ఉంటుంది. ఇది గమనించిన మురారి.. మనం అనుకున్నది ఏదీ జరగదు.. మనం ఎప్పటికీ ఇలాగె కలిసి ఉంటాము అని కృష్ణకు దైర్యం చెప్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. Brahmamudi Serial: భార్య ముందే వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్న రాజ్.. తట్టుకోలేకపోతున్న కావ్య..! #krishna-mukunda-murari-serial #krishna-mukunda-murari-serial-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి