Krishna Mukunda Murari: కృష్ణ, మురారిలకు ఆదర్శ్ ట్విస్ట్.. ముకుంద ప్లాన్ ఫలించనుందా..? ఆదర్శ్ మాటలకు బాధపడిన కృష్ణ, మురారిలు ఇంటి బయటకు వెళ్లిపోతుంటారు. కానీ ఆదర్శ్ వాళ్ళను వెళ్లకుండా ఆపేసి అందరికీ షాకిస్తాడు. మరో వైపు ముకుంద ఎలాగైనా ఆదర్శ్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని డిసైడ్ అవుతుంది. By Archana 08 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Krishna Mukunda Murari: ఆదర్శ్ మాటలకు బాధపడిన కృష్ణ, మురారిలు ఇంటి నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతారు. బ్యాగులు పట్టుకొని కిందకు వస్తారు. ఇది చూసిన రేవతి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దీంతో కృష్ణ.. ఆదర్శ్ తన బాధకు కారణం మేమె అని గట్టిగా నమ్ముతున్నాడు. ఇక్కడే ఉండి తనను ఇంకా బాధపెట్టాలని అనుకోవడం లేదు. అందుకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాము అని అత్త రేవతితో చెప్తుంది. ఆ తర్వాత మురారి.. తన అమ్మ రేవతిని కూడా తనతో పాటు వచ్చేయమని చెప్తాడు. ఇక రేవతి కూడా వాళ్ళతో పాటు బయలుదేరుతుంది. మురారి ఇంటి నుంచి వెళ్లిపోతుండడంతో ముకుంద షాకవుతుంది. మురారి కోసం ఇంత కష్టపడి వస్తే.. తాను వెళ్లిపోతానని అంటాడు ఏంటీ అని అనుకుంటుంది. ఇప్పుడు మురారిని ఆపడం ఎలా అని టెన్షన్ పడుతుంది. మరో వైపు ఇంట్లో వాళ్ళందరూ కృష్ణ , మురారిలు వెళ్లకుండా ఆపాలని ప్రయత్నిస్తారు. కానీ కృష్ణ, మురారిలు మాత్రం అసలు వినిపించుకోరు. ఇందంతా చూస్తున్న ఆదర్శ్ బెల్లం కొట్టిన రాయిలా ఏం మాట్లాడకుండా ఉంటాడు. మురారి, కృష్ణ బయటకు రాగానే భవానీ దేవి ఎదురవుతుంది. మిమల్ని ఇంటి నుంచి వెళ్ళిపోమన్న వాళ్ళు.. ఎందుకు వెళ్లామన్నారు ఒక్క కారణం చెప్తే మీరు ఉండాలో లేదో డిసైడ్ చేస్తాను అని ఆదర్శ్ ను ఉద్దేశించి చెప్తుంది. దీంతో ఆదర్శ్ మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత మురారి బ్యాగ్.. తానే లోపలికి తీసుకొని వెళ్తాడు. దీంతో భవానీ దేవి.. అయిపోయింది కదా ఇంకెప్పుడు ఇలా బ్యాగులు పట్టుకుని వెళ్లొద్దని చెప్తుంది. ఆ తర్వాత ముకుంద.. ఆదర్శ్ ను పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటుంది. ఆదర్శ్ కు కృష్ణ పై ద్వేషం కలిగేలా చేయాలని అనుకుంటుంది. నేటితో ఎపిసోడ్ ముగుస్తుంది. Also Read: Ram Charan- Upasana: క్లింకారతో రామ్ చరణ్ థైలాండ్ వెకేషన్.. వైరలవుతున్న ఫొటోలు #krishna-mukunda-murari-today-episode #krishna-mukunda-murari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి