/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T141022.238-jpg.webp)
Krishna Mukunda Murari Serial Today Episode: భవానీ మేనకోడలు సంగీతకు ఆదర్శ్ తో పెళ్లి చేస్తానని రజినీకి మాటిస్తుంది ముకుంద. మరో వైపు కృష్ణ మురారి ఇంటికి వచ్చేసరికి ఆదర్శ్ మందు తాగుతూ ఉంటాడు. ఇది చూసిన మురారి.. ఆదర్శ్ దగ్గరకు వెళ్లి ఇంకెన్నాళ్లు ఇలా తాగుతూ ఉంటావు అని అడుగుతాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T145504.286-jpg.webp)
మురారి పై కోపంతో రగిలిపోతున్న ఆదర్శ్.. నువ్వు నాకు నీతులు చెప్పొద్దు. నీ వల్లే నా జీవితం ఇలా తయారైంది. నిన్ను చూస్తేనే కంపరంగా ఉందని మురారిని నానా మాటలు అంటాడు. ఇందంతా పై నుంచి గమనిస్తున్న భవానీ దేవి బాధపడుతుంది. అక్కడే ఉన్న ముకుంద వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యతే తనది అని భవానీదేవికి మటిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T140920.156-1-jpg.webp)
మరో వైపు ఆదర్శ్.. మురారిని అసహ్యించుకోవడం నచ్చని ముకుంద... ఎలాగైనా ఆదర్శ్ మనసులో మురారి పై ఉన్న కోపాన్ని పోగొట్టాలని అనుకుంటుంది. దీని కోసం కృష్ణ చెడ్డదాన్ని చేయాలని డిసైడ్ అవుతుంది ముకుంద.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T145518.805-jpg.webp)
ఆదర్శ్ దగ్గరకు వెళ్లిన ముకుంద.. కృష్ణ గురించి అతనిలో విషం నింపే ప్రయత్నం చేస్తుంది. ముకుంద చావుకు మురారి కారణం కాదు కృష్ణే అని లేని పోనీ మాటలు చెప్పి ఆదర్శ్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ నిజాలని నమ్ముతాడు ఆదర్శ్. దీంతో ముకుంద తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని సంతోష పడుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T145616.024-jpg.webp)
మరో వైపు ఆదర్శ్ మాటలను తలుచుకొని బాధపడుతుంటే.. భర్తను ఓదారుస్తుంది కృష్ణ. ఆ తర్వాత మురారి.. తనంటే ఇష్టం లేదని చెప్పిన ముకుంద పై కోపం పెంచుకోవాలి కానీ మనల్ని ఎందుకు అసహ్యించుకుంటున్నాడు అని అంటాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T145532.776-jpg.webp)
దీంతో కృష్ణ.. ముకుంద గురించి ఆదర్శ్ కు ఎవరో మంచిగా చెప్తున్నారు అనుకుంటా అందుకే తన అభిప్రాయం మారినట్లు ఉంది అని అంటుంది. దానికి మురారి.. ఎవరు చెప్తున్నారు అని అడగగా.. మీరానే కావచ్చు కదా అని డౌట్ పడుతుంది కృష్ణ.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T145558.741-jpg.webp)
ఆదర్శ్ మాటలకు తట్టుకోలేకపోయిన మురారి.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. కృష్ణతో బట్టలు సర్దమని సీరియస్ గా చెప్తాడు. నేటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో కృష్ణ, మురారి బయటకు వెళ్లిపోతుంటారు. ఇంట్లో అందరూ వాళ్ళను ఆపడానికి ప్రయత్నిస్తారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T141022.238-1-jpg.webp)
Follow Us