Krishna Mukunda Murari: ముకుంద చనిపోయిందని భావిస్తున్న కుటుంబ సభ్యులు.. ఆమెకు తండ్రి శ్రీనివాస్ చేత పిండం పెట్టిస్తారు. ఇందంతా అక్కడే ఉండి చూస్తున్న ముకుంద.. బ్రతికి ఉండగానే తనకు పిండం పెట్టే పరిస్థితి వచ్చిందని బాధపడుతుంది. తండ్రి భుజం పై తల వాల్చి ఏడుస్తుంది.
ముకుంద ఏడవడంతో తండ్రి శ్రీనివాస్ ఆమెను ఓదారుస్తాడు. దీంతో ఎవరికీ డౌట్ రాకుండా.. "నా కూతురు చనిపోలేదమ్మా.. నీలోనే ఉంది. ఈ రోజు నుంచి నీలో నా కూతురిని చూసుకుంటానని కవర్ చేస్తాడు శ్రీనివాస్.
ఆ తర్వాత భవానీ ఆడపడుచు రజినీ ఇంట్లో పెద్ద పంచాయితీ పెడుతుంది. ముకుంద ఎలా చనిపోయిందని కృష్ణను అడగగా.. అందరు చనిపోయినట్లే చనిపోయిందని వెటకారంగా సమాధానం చెప్తుంది కృష్ణ. దీంతో ఒళ్ళు మండిపోయిన రజినీ.. భవానీ దేవిని పిలిచి గోల చేస్తుంది.
భవానీ దేవి రాగానే.. నీ కోడలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఏది అడిగిన వంకరగా సమాధానం చెప్తుంది అని కృష్ణ పై రెచ్చిపోతుంది. దీంతో భవానీ దేవి.. ముకుంద పిండం కాకులు ముట్టలేదనే బాధలో ఉంటే ఈ గోల ఏంటీ అని సీరియస్ అవుతుంది.
ముకుంద పేరు తీయగానే మరో కొత్త నాటకం మొదలు పెడుతుంది మీరా. ముకుంద గుర్తుకు వస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదంతా నిజమని నమ్ముతున్న ఆదర్శ్.. మీరా బాధను చూసి తట్టుకోలేక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. మీరా పేరును ముకుందగా మార్చాలని చెప్తాడు. ఇలా చేస్తే తనకు ముకుంద గుర్తుకు రాదు.. తన ఫ్రెండ్ బ్రతిక ఉందన్న ఫీలింగ్ ఉంటుంది అని చెప్తాడు.
మీరా పేరును ఆదర్శ్ ముకుందగా మార్చడం నచ్చలేదని కృష్ణ మురారి అనుకుంటారు. ఆదర్శ్ మనసు ఎలాగైనా మార్చాలి.. ముకుంద చావుకు మనం కారణం కాదనే నిజం తెలిసేలా చేయాలి అని అంటుంది కృష్ణ. దీనికి మురారి.. ఆదర్శ్ మనల్ని నమ్మే పరిస్థితిలో లేదు.. మనల్ని ఒక శత్రువులు గానే చూస్తున్నాడు అని బాధపడతాడు.
మరో వైపు భవానీ మేనకోడలు సంగీతకు ఆదర్శ్ తో పెళ్లి చేయాలనీ అనుకుంటుంది రజినీ. దీనికి ముకుంద సహాయం చేస్తానని ఆమెతో చేతులు కలుపుతుంది. ఆ తర్వాత రజినీ.. చచ్చిపోయిన పెళ్ళాం పేరు నీకు పెడితే నువ్వు తల ఊపావు ఏంటీ..? నీ మనసులో ఏమైనా ఉందా అని ముకుందను నిలదీస్తుంది. ఈరోజు తన పెళ్ళాం పేరు నీకు పెట్టినవాడు.. రేపు నీలో తన పెళ్ళాన్ని ఊహించుకుంటాడేమో అని అంటుంది. దీంతో ముకుంద షాక్ అవుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Raashii Khanna: హైదరాబాద్ లో రాశీ కన్నా కొత్త ఇంటి గృహప్రవేశం .. వైరలవుతున్న ఫొటోలు