Krishna Mukunda Murari: ముకుంద, ఆదర్శ్ ను కలిపే బాధ్యత నెరవేర్చలేకపోయాననే బాధతో భవానీ దేవిని క్షమాపణలు అడుగుతుంది కృష్ణ. దీంతో భవానీ దేవి.. మనుషులను అయితే మార్చగలం.. కానీ బండరాయిని మార్చలేం కదా. ముకుంద ఒక బండరాయి. తనను నువ్వు గుడ్డిగా నమ్మేశావు. ఇకనైనా నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టు అని కృష్ణకు దైర్యం చెప్తుంది.
మరో వైపు ఇంట్లోకి రెండు కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తాయి. భవానీ దేవి ఆడపడుచు, తన కూతురు ఇంటికి వస్తారు. రావడంతోనే తన నోటి దురుసు చూపిస్తుంది భవానీ దేవి ఆడపడుచు. ముకుంద చనిపోయిందనే విషయం తెలుసుకొని వచ్చాను. నా కూతుర్ని కోడలిగా చేసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని పుల్ల విరుపుగా మాట్లాడుతుంది ఆడపడుచు రజినీ.
రజినీ ఇలా మాట్లాడడంతో .. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అని సీరియస్ అవుతుంది భవానీ దేవి. దానికి రజినీ ఏం తెలుసు నీకు.. అందుకే ఆదర్శ్ తాగుబోతు అయ్యాడా అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది.
తన అత్త గురించి అలా మాట్లాడడం తట్టుకోలేకపోయిన కృష్ణ.. రజినీ పై సీరియస్ అవుతుంది. ఇంకోసారి పెద్దత్తయ్యను పేరు పెట్టి పిలుస్తే మర్యాదగా ఉండదని ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో రజినీ.. మా వదినను ఏమని పిలవాలో నాకు తెలుసు... చెప్పడానికి నువ్వెవరూ అని కృష పై రెచ్చిపోతుంది.
మరో వైపు రజినీ.. తన కూతురు సంగీతను ఆదర్శ్ కు దగ్గర చేయాలనీ ప్లాన్ చేస్తుంది. ఆదర్శ్ తిన్నాడో లేదో వెళ్లి కనుక్కోమని పంపిస్తుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్లిన సంగీత.. ఆదర్శ్ తో క్లోజ్ ఉండడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆదర్శ్ మాత్రం ఆమెను తిట్టి పంపిస్తాడు.
ఉదయాన్నే సంగీత కాఫీ కావాలని తన అమ్మ రజినీని అడుగుతుంది. ఇంతలో కృష్ణ రావడం గమనించిన రజినీ.. మనం పెట్టుకునే అవసరం లేదు.. అదిగో పనిమనిషి వస్తుంది కదా.. తనే పెట్టిస్తుంది అని కృష్ణను అవమానిస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.