Krishna Mukunda Murari: ఆదర్శ్ కు అడ్డంగా దొరికిపోయిన ముకుంద.. అసలు రూపం బయట పడనుందా..?

మీరాను ముకుంద అని పిలవడంతో కృష్ణ పై కోప్పడతాడు ఆదర్శ్. మరో వైపు కృష్ణ తల్లి కావాలని భవానీ దేవి రాసిన ఉత్తరాన్ని కోపంతో చింపేస్తుంది ముకుంద. ఇది చూసిన ఆదర్శ్ షాకవుతాడు. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari: ఆదర్శ్ కు అడ్డంగా దొరికిపోయిన ముకుంద.. అసలు రూపం బయట పడనుందా..?

Krishna Mukunda Murari Serial: హొలీ వేడుకల్లో మీరా .. మురారితో క్లోజ్ ఉండడం గమనించిన కృష్ణ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మురారి అక్కడికి వస్తాడు. కృష్ణ సైలెంట్ గా ఉండడం చూసి ఏమైందని అడుగుతాడు. దీంతో కృష్ణ.. మీరా ప్రవర్తన బాగోలేదని.. హొలీ రంగులు పట్టుకొని మీ వెంట తిరుగుతుంది.. రాసుకొని పూసుకొని తిరగడం నచ్చలేదు అని చెప్తుంది. అసలు తన మనసులో ఏముందో తెలియడం లేదని మురారితో తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది.

publive-image

ఆ తర్వాత మురారి తన మనసులో ఏముందో తెలియదు కానీ.. నీ మనసులో మాత్రం నా పై పొసెసివ్‌నెస్‌ ఉందని కృష్ణను ఆటపట్టిస్తాడు. మరో వైపు కృష్ణ .. ఆదర్శ్ తనతో మాట్లాడడం లేదని బాధపడుతుంది. దానికి మురారి సమయం వచ్చినప్పుడు నాతో మాట్లాడినట్లే నీతో మాట్లాడతాడు అని కృష్ణకు దైర్యం చెప్తాడు.

Krishna Mukunda Murari
ముకుంద అద్దం ముందు నిల్చొని రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో భవానీ ఆడపడచు రజినీ అక్కడికి వస్తుంది. ఏంటీ నా కూతురికి ఆదర్శ్ తో పెళ్లి చేస్తానని చెప్పి .. వాడు నీ వెంట పడేలా చేసుకుంటున్నావు అని ముకుందతో అంటుంది. దానికి ముకుంద.. నా మనసులో అలంటి ఉద్దేశమేమి లేదని చెప్తుంది.

Krishna Mukunda Murari
ఆదర్శ్ ను ఎలాగైనా సంగీతకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న ముకుంద.. పెళ్లి విషయం గురించి భవానీ దేవితో మాట్లాడమని రజినీని రెచ్చగొడుతుంది. ఆలస్యం చేయడం మంచిది కాదని చెప్తుంది.

Krishna Mukunda Murari
ఇక ముకుంద మాటలకు పడిపోయిన రజినీ భవానీ దేవి దగ్గరకు వెళ్లి ఆదర్శ్, సంగీత పెళ్లి గురించి మాట్లాడుతుంది. దానికి భవానీ అనుకున్న వెంటనే అన్నీ జరిగిపోవు కాస్త ఓపిక పట్టాలి అని చెప్తుంది. కాదని మాత్రం చెప్పలేదు కదా వదిన అని రజినీ సంతోషపడుతుంది. ముకుంద కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది.

publive-image
ఆ తర్వాత మధు హొలీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అందరికీ చూపిస్తూ ఉంటాడు. వాటిలో మురారి, ముకుంద ఫొటోలే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో కృష్ణ మొహం కాస్త డల్ గా పెడుతుంది. ఇక తన పై ఎక్కడ డౌట్ వస్తుందో అని భావించిన ముకుంద.. ఫోటోలు చూడడం ఆపేసి తిందామని అందరినీ డైవర్ట్ చేస్తుంది.

publive-image
మరో వైపు కృష్ణ ముకుంద కోసం ఫోన్ గిఫ్ట్ గా ఇస్తుంది. అయితే ఫోన్ ఇచ్చే సమయంలో మీరా అని పిలుస్తుంది కావ్య. దీంతో ఆదర్శ్.. మీరా పేరును ముకుంద అని మార్చాము కదా ఇంకా ఎందుకు అలా పిలుస్తున్నావు ఎందుకు అని కోప్పడతాడు. అంటే ముకుంద అని మార్చడం ఇష్టం లేదా అని అంటాడు. వెంటనే మురారి తన ఉద్దేశం అది కాదని కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. నేటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో కృష్ణ తల్లి కావాలని భవానీ దేవి రాసిన లెటర్ ను చూసిన ముకుంద కోపంతో దాన్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తుంది. ఇది ఆదర్శ్ చూస్తాడు.

publive-image

Also Read: Rajamouli: ప్రభుదేవా పాటకు రాజ‌మౌళి ఎలా స్టెప్పులు వేశారో చూడండి.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు