Krishna Mukunda Murari Serial: కృష్ణ మురారి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇదే సమయంలో కృష్ణ.. ఏసీపీ సార్ నిజంగానే ఆదర్శ్ (Adarsh) , ముకుంద కలిసి ఉంటున్నారా..? అని మురారిని అడుగుతుంది. దీంతో మురారి నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తాడు. పెద్ద అత్తయ్యకు ఇంకా ముకుంద (Mukunda) పై అనుమానం ఉంది కదా.. అందుకే నాకు కూడా నిజమేమోనని డౌట్ వస్తుంది అని చెప్తుంది. ఇక మురారి ఇప్పుడు బయటకు వెళ్తున్నాము కదా.. అక్కడ గమనిద్దామని కృష్ణతో చెప్తాడు.
ముకుంద- ఆదర్శ్, కృష్ణ- మురారి కారులో గుడికి బయలుదేరుతారు. కారులో అందరు సైలెంట్ గా ఉండడంతో.. ఎందుకు అలా ఉన్నారు ఏదైనా మాట్లాడండి అని కృష్ణ అంటుంది. ఇక మాట్లాడకపోతే డౌట్ వస్తుందేమోనని భావించిన ముకుంద.. అదేం లేదు కృష్ణ (Krishna).. నాకు ఇష్టమైన పాట వస్తుంటే వింటున్నాను అని అంటుంది. ఆ తర్వాత కృష్ణ వేరే పాట పెట్టగానే.. మురారి తనకు నచ్చిన పాట పెడతాడు. వెంటనే ముకుంద మురారికి నచ్చిన పాటే.. నాకు ఇష్టం.. మేము ఇద్దరం ఒకటే అని అంటుంది. ఆ మాటకు ఆదర్శ్, కృష్ణ షాకవుతారు.
గుడికి రాగానే.. ముకుంద- ఆదర్శ్ లోపలికి వెళ్ళిపోతారు. కారులో ముకుంద మాట్లాడిన మాటల పై అనుమానం వచ్చిన కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఏమైందని మురారి అడగగా.. ముకుంద.. మీరు ఇద్దరు ఒకటేనని అనడం వెనుక అర్ధం ఏంటని మురారిని ప్రశ్నిస్తుంది. దీనికి మురారి.. పాటల గురించి మా ఇద్దరి ఇష్టాలు ఒకటే అని చెప్పింది.. దాని గురించి ఎక్కువ ఆలోచించకని కృష్ణకు దైర్యం చెప్తాడు.
ఇటు ఆదర్శ్ - ముకుంద.. కృష్ణ- మురారి కోసం లోపల వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఆదర్శ్.. మనిద్దరినీ కలపాలని కృష్ణ- మురారి చాలా కష్టపడుతున్నారని ముకుందతో అంటాడు. ముకుంద మాత్రం గుడిలో కూడా ప్రశాంతత లేదు అని.. ఆదర్శ్ చెప్పే మాటలకు మనసులో చిరాకు పడుతూ ఉంటుంది.
రెండు జంటలు కలిసి గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటారు. ఈ ఏడాదిలో ఇద్దరు పండంటి బిడ్డకు జన్మనివ్వాలని పూజారి ఆశీర్వదిస్తారు. ఇంకా మురారినే ప్రేమిస్తున్న ముకుంద మాత్రం.. ఇద్దరిలో ఒకరే మురారి బిడ్డకు తల్లి అవుతారని మనసులో అనుకుంటుంది.
గుడిలో ధ్వజ స్థంభం నుంచి గంట కింద పడడంతో.. ఏదో కీడు జరగబోతుందని టెన్షన్ పడుతుంది కృష్ణ. ఇంతలో అక్కడికి వచ్చిన పూజారి.. ధ్వజ స్థంభం నుంచి గంట కింద పడడం.. మీకు మాత్రమే కాదు గుడికి కూడా అరిస్టమని చెప్తాడు. దీంతో కృష్ణ అనుమానం మరింత పెరిగిపోతుంది.
కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆదర్శ్, మురారి.. ఇది ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన గుడి అందుకే అలా జరిగిందని కృష్ణకు దైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. విడిపోయి కలిసిన వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారని కృష్ణకు చెప్తాడు ఆదర్శ్. ఆ తరువాత ఆదర్శ్ కొబ్బరి చిప్పను కొడుతుండగా చేతికి దెబ్బతగులుతుంది.. కానీ ముకుంద మాత్రం భర్తను పట్టించుకోకుండా ఏదో ధ్యాసలో ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో