జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఆయనో ప్రముఖ సీనియర్ నాయకుడు. టీడీపీలో ఓనమాలు దిద్ది ఆ తరువాత ప్రజారాజ్యం, కాంగ్రెస్,వైసీపీ పార్టీల్లో చేరి దాదాపు అన్ని పార్టీల తీర్థం పుచ్చుకున్న నాయకునిగా పేరు పొందారు... గతంలో వైసీపీలో కొన్ని కారణాలతో పార్టీ నుంచి తప్పించారు...అయితే ప్రస్తుతం మరోసారి తను ఓనమాలు దిద్దిన సైకిల్ పార్టీ వైపు చూస్తున్నారా..... ...ఆ నేత సైకిల్ ఎక్కుతరా.... ఇంతకు ఎవరీ నేత..
కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రల్లోనూ సుపరిచితమే..ఉమ్మడి రాష్ట్రంలో కొత్తపల్లి సుబ్బారాయుడు వరుసగా నాలుగు సార్లు నరసాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే గా గెలుపొందారు.అంతే కాదు టీడీపీ హయంలో మంత్రిగా సైతం పనిచేశారు. ఆ తరువాత టీడీపీ నుంచి బయటకు వచ్చి 2009 లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం నుంచి నరసాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Also read: భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా..పేలిన బాంబు!
అనంతరం 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పుడే వచ్చిన ఉప ఎన్నికలో నర్సాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రం విడిపోయాక వచ్చిన 2014ఎన్నికల్లో వైసీపీకి వెళ్ళి నరసాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాధవ నాయుడుపై ఓటమి చెందారు.... కొన్నాళ్లకే మరోసారి టీడీపీకు చేరి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు సుబ్బారాయుడు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో నిరుత్సాహపడి వైసీపీ తీర్థం సైతం పుచ్చుకుని వైసీపీ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసిన ప్రసాదరాజు గెలుపునకు కృషి చేశారు.
కొన్నాళ్ళు పార్టీలో ప్రయాణం బాగనే సాగిన జిల్లా కేంద్రం భీమవరం తరలిపోవడంతో నరసాపురంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు సుబ్బరాయుడు. నిత్యం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ వైసీపీని గెలిపించుకుని చాలా తప్పు చేశాం అంటూ తను చేస్తూన్న నిరసన కార్యక్రమంలో చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురం రావాల్సిన జిల్లా కేంద్రం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు వల్లే భీమవరం తరలిపోయిందని అనేక సార్లు విమర్శలు గుప్పించారు. .దీంతో వైసీపీ అధిష్ఠానం సుబ్బరాయుడుని పార్టీ నుంచి బహిష్కరించింది. అప్పటి నుంచి వైసీపీకి అత్యంత దూరంగా వుంటూ ఎప్పటికపుడు వైసీపీ పార్టీనీ విమర్శిస్తూ వస్తున్నారు.
సుబ్బరాయుడు ఎన్ని పార్టీలు మారిన ఇప్పటికీ అతని వెంట నడిచే కార్యకర్తలు అలానే వున్నారు.. గత కొన్నాళ్ళ నుంచి సుబ్బరాయుడు సైకిల్ ఎక్కుతారు అనే ఊహాగానాలు జోరుగా ప్రచారం సాగాయి. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు సుబ్బరాయుడు. నరసాపురంలో ఏకంగా చంద్రబాబుకు మద్దతుగా బైక్ ర్యాలీ చేపట్టడం,టీడీపీ నాయకులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో సుబ్బరాయుడు పాల్గొనడం ఇదంతా మరోసారి తాను రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ అయిన టీడీపీలో చేరుతారు అనే ప్రచారం జరిగిపోతుంది.
ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నుంచి త్రిముఖ పోటీ నెలకొని ఉన్న కొత్తగా సుబ్బరాయుడు చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఊహాగానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.మొన్నటి వరకు జనసేనలోకి సుబ్బరాయుడు ఎంట్రీ ఇస్తారు అనుకున్న నియోజవర్గ ప్రజలు సుబ్బరాయుడు అనుసరిస్తున్న విధానాలు చూస్తే సుబ్బరాయుడు చూపు టీడీపీ వైపే వున్నట్టు అనిపిస్తుంది.అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న కొత్తపల్లి ఎటూ వైపు వెళ్తారో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.