AP Politics : ఆ పార్టీలోకి కొత్తపల్లి.. చేరిక ఎప్పుడంటే?

జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్లనున్నారు. ఆయన్ను గతంలో వైసీపీ తన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున విజయవాడలో పవన్ సమక్షంలో చేరనున్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన జనసేన టిక్కెట్‌పై పోటీ చేయవచ్చని సమాచారం.

AP Politics : ఆ పార్టీలోకి కొత్తపల్లి.. చేరిక ఎప్పుడంటే?
New Update

Kothapalli To Join Janasena : ఏపీ(AP) లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల్లో మార్పులు.. చేర్పులు, చేరికలు జరగుతున్నాయి. వైసీపీ(YCP) నుంచి జనసేన(Janasena) లోకి, టీడీపీ, జనసేన నుంచి వైసీపీలోకి జంపింగ్‌లు పెరుగుతున్నాయి. తాజాగా జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayudu) వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. వైజాగ్‌(Vizag) లో పవన్‌ కల్యాణ్‌తో కొత్తపల్లి సమావేశమయ్యారు. ఈ నెలాఖరున విజయవాడలో పవన్ సమక్షంలో చేరనున్నారు. ఇక 2019లో నరసాపురం నుంచి టీడీపీ టికెట్‌ ఆశించారు కొత్తపల్లి. అప్పుడు టికెట్‌ రాకపోవడంతో చివరి నిమిషంలో వైసీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాదరాజుకు మద్దతిచ్చారు.



పార్టీ నుంచి సస్పెండ్‌:

గతంలో కొత్తపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. పార్టీ లైన్ దాటడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన నరసాపురం జిల్లాకు భీమవరం జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై సుబ్బరాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై అప్పట్లో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయడంలో విఫలమయ్యారంటూ ఆ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద రాజును ఆయన టార్గెట్ చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల(2019 Assembly Elections) లో రాజు విజయం కోసం పనిచేసినందుకు పశ్చాత్తాపంగా వేదికపై చెప్పులతో తనను తాను కొట్టుకున్నాడు.

నరసాపురం నుంచి పోటీ చేస్తారా?

తెలుగుదేశం పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యే, క్యాబినెట్‌ మంత్రి పదవులతో సహా పలు పదవులు అనుభవించిన ఆయన 2009లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ(Praja Rajyam Party)లోకి ప్రవేశించి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో వైసీపీ చేరి నరసాపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలోకి వెళ్లి 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఆయనకు నరసాపురం నుంచి పార్టీ టికెట్ రాకపోయినా ఎమ్మెల్సీ సీటు వస్తుందని భావించారుజ అది కూడా రాకపోవడంతో ఆయన వైసీపీపై అసంతృప్తితో వ్యక్తం చేశారు. ఇక వైసీపీ నుంచి సస్పెండ్ తర్వాత ఆయన జనసేనలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడదే నిజం అవ్వబోతోంది. రానున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన జనసేన టిక్కెట్‌పై పోటీ చేయవచ్చని సమాచారం.

Also Read: దిగ్గజ న్యాయవాది ఫాలీ ఎస్‌.నారీమన్‌(95) కన్నుమూత!

#kothapalli-subbarayudu #ap-elections-2024 #ap-politics-2024 #janasena
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe